బాస్ బర్త్‌డే.. వారం ముందుగానే సందడి షూరూ..

  • Published By: sekhar ,Published On : August 11, 2020 / 04:10 PM IST
బాస్ బర్త్‌డే.. వారం ముందుగానే సందడి షూరూ..

Updated On : August 11, 2020 / 4:29 PM IST

తమ అభిమాన హీరో పుట్టిన రోజునాడు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. గతంలో రక్తదానాలు, కటౌట్లకు పాలాభిషేకాలు, పూజలు వంటివి చేసేవారు. సోషల్ మీడియా వచ్చాక ఇవన్నీ అవుట్‌డేట్ అయిపోయాయి.

కామన్ డీపీ, ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ వంటి వాటిపై దృష్టిపెట్టడుతున్నారు. రికార్డుల గురించి సోషల్ మీడియాలో చర్చలు సాగిస్తున్నారు. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా మెగాభిమానులు మరో కొత్త సాంప్రదాయానికి తెర తీయబోతున్నారు.

కామన్ డీపీతో పాటు కామన్ మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే ఓ వీడియోను రూపొందించిన మెగాఫ్యాన్స్ ఆగస్టు 15వ తేదీన ఈ కామన్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారని సమాచారం. చిరు 65వ పుట్టినరోజు కావడంతో సినీ పరిశ్రమలోని వివిధ బాషలకు చెందిన 65 మంది ప్రముఖులతో ఈ కామన్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించున్నారట.