×
Ad

Varanasi: “వారణాసి” టైటిల్ వివాదం.. ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు.. చిక్కుల్లో రాజమౌళి

వారణాసి టైటిల్ మాది అంటూ దర్శకుడు రాజమౌళిపై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు నమోదయ్యింది. (Varanasi)ఈ మేరకు రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ సంస్థ నుంచి ఈ ఫిర్యాదు నమోదు అయ్యింది.

Complaint filed against Rajamouli in Varanasi title controversy at Film Chamber

Varanasi: వారణాసి టైటిల్ మాది అంటూ దర్శకుడు రాజమౌళిపై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు నమోదయ్యింది. ఈ మేరకు (Varanasi)రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ సంస్థ నుంచి ఈ ఫిర్యాదు నమోదు అయ్యింది. తాము రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ను అనుమతి లేకుండా వేరే సినిమాకు ఎలా వాడతారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Rajamouli: వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై వ్యాఖ్యలు.. రాజమౌళి పై కేసు నమోదు

ఇంతకీ అసలు విషయం ఏంటంటే, రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ ఇటీవలే తమ కొత్త సినిమాను ప్రకటించింది. సనాతన ధర్మ పరిరక్షణ అనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిస్తున్నాం అంటూ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆది సాయి కుమార్ తో రఫ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సీహెచ్ సుబ్బారెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా తమ టైటిల్ గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. “వారణాసి టైటిల్ మాది. రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ పై రిజిస్టర్ చేయించాము. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఛాంబర్ నుంచి లెటర్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి, మేము రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ను మా అనుమతి లేకుండా ఎలా వాడతారు” అంటూ నిర్మాత విజయ్ కే ఆరోపించారు. దీంతో వారణాసి సినిమాపై కొత్త వివాదం నెలకొంది.

ఇక మరోవైపు హనుమంతుడి గురించి తప్పుగా మాట్లాడినందుకు కూడా దర్శకుడు రాజమౌళిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. మరి ఈ రెండు ఫిర్యాదులపై రాజమౌళి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.