అల వైకుంఠపురములో : సుశాంత్ లుక్..రాములో రాములా సాంగ్ టీజర్

  • Publish Date - October 20, 2019 / 11:59 AM IST

అల..వైకుంఠపురములో సినిమా యూనిట్ మరో హీరో లుక్‌ను విడుదల చేసింది. అల్లు అర్జున్‌తో పాటు హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన లుక్‌ను 2019, అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేసింది. రాజ్ అనే పాత్రను సుశాంత్ పోషిస్తున్నారని తెలిపింది. ఇతని అందమైన చిరునవ్వు ఎవరినైనా ఆకర్షిస్తుంది అనే ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోలో సుశాంత్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. బన్నీకి ఫ్రెండ్‌ ప్రాత పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అల్లు అర్జున్ లుక్, సామజవరగమనా అనే సాంగ్ రిలీజ్ చేసింది. అభిమానులను ఎంతో అలరించింది సాంగ్. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇదిలా ఉంటే దీపావళి పండుగ సందర్భంగా మరో సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు లెటెస్ట్‌గా ప్రకటించింది హారిక హాసిని క్రియేషన్ సంస్థ. రాములో రాములా..అనే సాంగ్‌ను అక్టోబర్ 21వ తేదీ సోమవారం సాయంత్రం 4.05 విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే సామజ వరగమనా..అనే సాంగ్ రికార్డు సృష్టిస్తోంది. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.. సామజవరగమన.. నినుచూసి ఆగగలనా… మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా’.. అంటూ సాగే ఈ బ్యూటీఫుల్ మెలోడీ అక్షరాలా 40 మిలియన్స్‌కు పైగా వ్యూస్, 7 లక్షలకు పైగా లైక్స్ తెచ్చుకుని, మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 
Read More : రాజీనామా చేస్తా : ‘మా’ తీరుపై మండిపడ్డ పృథ్వీ

తాజాగా విడుదల చేసే ఈ సాంగ్ ఎలాంటి రచ్చ రచ్చ చేస్తుందో చూడాలి. మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇది అల్లు అర్జున్‌కు 19వ సినిమా. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో అలనాటి తార టబు రీ ఎంట్రీ ఇస్తున్నారు. నవదీప్ కూడా ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ‘అల వైకుంఠపురములో’… రిలీజ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు