Conditions for Prabhas Movie Actress Imanvi up To Movie Completion
Imanvi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇరాక్ ఈ సినిమాలో సోషల్ మీడియా ఫేమ్, డ్యాన్సర్ అయిన ఓ కొత్త అమ్మాయి ఇమాన్వి ని తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఫౌజీలో ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్న హీరోయిన్ ఇమాన్వికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయట. అయితే అదృష్టం తలుపు తడితే మోకాలు అడ్డం పెట్టినట్లు ఇప్పటికే ఒప్పుకున్న సినిమా డేట్స్ అడ్డంకిగా మారాయట. ప్రభాస్‌తో సినిమా కంప్లీట్ చేసే వరకు బల్క్ డేట్స్ ఫౌజీకి ఇచ్చేసిందంట ఇమాన్వి. ప్రభాస్ షెడ్యూల్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఇమాన్వి డేట్స్ ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. దీంతో మరో సినిమా ఒప్పకోవడానికి అవకాశం లేకుండా పోయిందని ఫీల్ అవుతోందట ఇమాన్వి.
Also Read : HariHara VeeraMallu : హరిహర వీరమల్లు షూటింగ్ ఫొటో వైరల్.. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఎప్పట్నించి అంటే..
ఫౌజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతోంది. ప్రభాస్ వచ్చే సంక్రాంతి తర్వాత షూటింగ్‌లో జాయిన్ అవుతాడని అంటున్నారు. అప్పటివరకు ప్రభాస్ లేని సీన్స్ షూట్ చేస్తున్నారట. అయితే ప్రభాస్ ఈ సినిమాకు డేట్స్ ఎప్పుడు కేటాయిస్తే అప్పుడు ఇమాన్వి కూడా ఉండాలనే అందుబాటులో ఉండాలని ఆమెకు భారీగానే పారితోషికం ఇచ్చారట. అయితే ఓవైపు ఫౌజీ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే మరోవైపు ఇమాన్వికి సినిమా ఆఫర్లు వస్తున్నాయట. దీంతో ఏం చేయాలో ఇమాన్వికి తోచట్లేదట. ఫౌజీ సినిమా ఉండగానే మరో ప్రాజెక్టు ఒప్పుకుంటే ప్రభాస్ మూవీకి డేట్స్ క్లాష్ అవుతాయని ఇబ్బంది పడుతోందట. ప్రభాస్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మరో ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తోందట ఇమాన్వి.
డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఏ సినిమాకి ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారనేది క్లారిటీ లేదు. డైరెక్టర్లు మాత్రం ఆయనతో చేస్తోన్న సినిమా షూటింగ్స్ మొదలెట్టేస్తున్నారు. ప్రభాస్ లేని సీన్లను ముందుగా తెరకెక్కించే పనిలో పడ్డారు. అలా ఫౌజీ మూవీ షూటింగ్ నెలరోజులుగా కొనసాగుతోంది. ప్రభాస్ మాత్రం సంక్రాంతి తర్వాత ఫౌజీ సెట్‌లోకి వస్తాడని అంటున్నారు. అప్పటివరకు హీరోయిన్ ఇమాన్వి వెయిట్ చేయాల్సిందేనంటున్నారు. మరి ప్రభాస్ సినిమా తర్వాత అయినా ఇమాన్వి వరుస సినిమాలు చేస్తుందా చూడాలి.