కంగ్రాట్స్ అనీల్ రావిపూడి: ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలకు ముందే శుభవార్త

  • Publish Date - January 5, 2020 / 08:23 AM IST

సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధం అవుతున్న దర్శకుడు అనీల్ రావిపూడికి సినిమా విడుదలకు ముందే గుడ్ న్యూస్ అందింది. అనీల్ రావిపూడి తండ్రి అయ్యాడు. అనీల్ వైఫ్ భార్గవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మీడియం రేంజ్ సినిమాలు తీస్తూ.. అపజయాలు లేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనీల్ రావిపూడి గతేడాది వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో ఎఫ్2 తీసి ఘన విజయం దక్కించుకున్నాడు. 

అనిల్ రావిపూడి ఓ కుమారుడు జన్మించడం, సమస్యలన్నీ సమసిపోయి సరిలేరు విడుదలకు రూట్ క్లియర్ అవ్వడం, ఇవాళ(05 జనవరి 2020) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగుతుండడం.. అన్నీ చకచకా జరిగిపోతూ ఉండడంతో సినిమా హిట్ అవుతుందని భావిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడికి శుభాకాంక్షలు వెల్లువవెత్తుతున్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా..  మా డైరెక్టర్ అనిల్ రావిపూడికి కుమారుడు జన్మించాడు.. కంగ్రాట్స్.. బుడ్డోడికి నా ఆశీస్సులు.. షేన్ ఆన్ బ్రదర్ అంటూ  ట్వీట్ చేశాడు. అనీల్ రావిపూడి- భార్గవి జంటకు ఇప్పటికే కూతురు ఉంది. ఇప్పుడు రెండో సంతానంగా కుమారుడు జన్మించాడు. అందుకు చాలా సంతోషంలో ఉందీ జంట. హైదరాబాద్ రెయిన్ బో ఆస్పత్రిలో భార్గవి బిడ్డకు జన్మనిచ్చారని తెలుస్తోంది.