బాలయ్యతో సినిమా ఫిక్స్

ఇయర్ రోజు గుడ్ నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన అనిల్ రావిపూడి

  • Published By: sekhar ,Published On : January 1, 2019 / 10:36 AM IST
బాలయ్యతో సినిమా ఫిక్స్

Anil Ravipudi

ఇయర్ రోజు గుడ్ నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి.. పటాస్‌తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అనిల్‌కి డైరెక్టర్‌గా గుర్తింపునివ్వడంతో పాటు, ఫ్లాప్స్‌లో ఉన్న కళ్యాణ్ రామ్‌కి ఊరటనిచ్చింది. తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కంప్లీట్ చేసిన అనిల్, విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్‌లతో చేసిన ఎఫ్2, ఈ సంక్రాంతికి రిలీజవుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో అనిల్ రావిపూడి, తను త్వరలో నటసింహ నందమూరి బాలకృష్ణతో సినిమా చెయ్యబోతున్నాని చెప్పాడు.

గతంలో అనిల్, బాలయ్యకి రామారావు అనే స్ర్కిప్ట్ వినిపించాడని వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్‌‌కి కూడా అనిల్‌ని పిలిచాడు బాలయ్య. ఇప్పుడు స్వయంగా అనిల్, బాలయ్యతో సినిమా చేస్తానని, అదికూడా బోయపాటి సినిమా తర్వాత ఉంటుందని చెప్పడంతో, వీళ్ళ కాంబోలో సినిమా కన్ఫమ్ అనుకోవచ్చు. న్యూ ఇయర్ రోజు అనిల్ రావిపూడి చెప్పిన ఈ గుడ్ న్యూస్ విని, బాలయ్య అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.