న్యూ ఇయర్ – న్యూ పోస్టర్స్ కళకళ
అప్ కమింగ్ మూవీస్ కొత్త పోస్టర్స్

అప్ కమింగ్ మూవీస్ కొత్త పోస్టర్స్
2019 కొత్త సంవత్సరం మొదటిరోజైన జనవరి 1న అప్ కమింగ్ మూవీస్ కొత్త పోస్టర్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్, మహేష్ బాబు మహర్షి, రామ్ చరణ్ వినయ విధేయ రామ, వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఎఫ్2, సూపర్ స్టార్ రజినీ కాంత్ పేట, కళ్యాణ్ రామ్ 118, రవిబాబు కొత్త సినిమా ఆవిరి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
బొద్దుగుమ్మ హన్సిక నటిస్తున్న తమిళ సినిమా మహా.. ఇది ఆమెకి 50వ సినిమా కావడం విశేషం. బాత్‌టబ్‌లో బ్లడ్‌లో, చేత్తో గన్ పట్టుకుని ఉన్న హన్సిక లుక్ థ్రిల్లింగ్‌గా ఉంది. మోహన్ లాల్, సూర్య, ఆర్య కలిసి నటిస్తున్న మూవీకి కాప్పాన్ అనే టైటిల్ కన్ఫమ్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. కన్నడ రెబల్ స్టార్, స్వర్గీయ అంబరీష్, సుమలతల తనయుడు, జూనియర్ రెబల్ స్టార్ అభిషేక్ అంబరీష్ హీరోగా పరిచయం అవుతున్న అమర్ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది.. వీటితో పాటు మరికొన్ని తమిళ్ సినిమాల లుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి.