చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ

త్రివిక్ర‌మ్ అనే పేరు వినిపించ‌గానే మ‌న‌కు తెలియ‌కుండానే గుర్తొచ్చే మ‌రో పేరు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆయ‌న ఆత్మ అయితే.. ఈయ‌న శ‌రీరం. అంత‌గా ఈ ఇద్ద‌రూ క‌లిసిపోయారు.

  • Published By: sreehari ,Published On : December 28, 2018 / 07:16 AM IST
చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ

త్రివిక్ర‌మ్ అనే పేరు వినిపించ‌గానే మ‌న‌కు తెలియ‌కుండానే గుర్తొచ్చే మ‌రో పేరు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆయ‌న ఆత్మ అయితే.. ఈయ‌న శ‌రీరం. అంత‌గా ఈ ఇద్ద‌రూ క‌లిసిపోయారు.

త్రివిక్ర‌మ్ అనే పేరు వినిపించ‌గానే మ‌న‌కు తెలియ‌కుండానే గుర్తొచ్చే మ‌రో పేరు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆయ‌న ఆత్మ అయితే.. ఈయ‌న శ‌రీరం. అంత‌గా ఈ ఇద్ద‌రూ క‌లిసిపోయారు. కొన్నేళ్లుగా ప‌వ‌న్ ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు మాట‌ల మాంత్రికుడు. ఆయ‌న‌తో మూడు సినిమాలు కూడా చేసాడు. ఇక కొన్నాళ్లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లో బిజీ అయిపోయాడు. అదే స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ కూడా ఇత‌ర హీరోల‌తో సినిమాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు స‌డ‌న్‌గా ఆయ‌న ‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుక‌లో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి వ‌చ్చాడు. దీనికి కారణం ఆయన చిరంజీవితో సినిమా చేస్తుండటమే. 

ఈ క‌ల‌యిక నిజంగానే ఊహించ‌లేదు ఎవ‌రూ. ముఖ్య అతిథుల జాబితాలో కూడా త్రివిక్ర‌మ్ పేరు లేదు. కానీ ఉన్న‌ట్లుండి మాట‌ల మాంత్రికుడితో క‌లిసి చ‌ర‌ణ్ రావ‌డంతో త‌ర్వాతి చిత్రం ఈయ‌న‌తోనే ఉండ‌బోతుందేమో అనుకున్నారు. కానీ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి తన సినిమా మాటల మాంత్రికుడితో ఉంటుందని అనౌన్స్ చేసాడు. ఈ కాంబినేషన్ సెట్ చేసింది కూడా మెగా వారసుడే అంటూ చెప్పాడు చిరు. వచ్చే ఏడాది చిరు, త్రివిక్రమ్ సినిమా ఉండబోతుంది. ఇన్నాళ్లూ తమ్ముడు ద‌గ్గ‌రే ఉన్న ఈ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు అన్నయ్య ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. చ‌ర‌ణ్ ఇప్పుడు రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు కాబ‌ట్టి మ‌రో ఏడాదిన్న‌ర వ‌ర‌కు ఈయ‌న వైపు చూడ‌టం ఏ ద‌ర్శ‌కుడికి సాధ్యం కాదు. అందుకే చిరంజీవితో సినిమా చేస్తున్నాడు మాటల మాంత్రికుడు.

చిరంజీవి ప్రస్తుతం సైరాతో పాటు మరో రెండు సినిమాలు కన్ఫర్మ్ చేసాడు. 152వ సినిమా కొరటాల శివతో ఉండబోతుంది. ఆ తర్వాత త్రివిక్ర‌మ్ సినిమా ఉంటుంది. ఈ విషయం కూడా చిరు క్లారిటీ ఇచ్చాడు. తనకు ఇంతమంచి దర్శకున్ని ఇచ్చినందుకు చరణ్‌కు కృతజ్ఞతలు చెప్పాడు మెగాస్టార్. ఈ చిత్రాన్ని దానయ్య నిర్మించనున్నాడని తెలిపాడు చిరంజీవి. మొత్తానికి మెగా కుటుంబంతో త‌న‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇలా విన‌య విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుక మెగా అభిమానులకు కొత్త క్లారిటీ ఇచ్చింది.