పెద్ద పండక్కి పెట్టా తెలుగు రిలీజ్ ఫిక్స్

  • Published By: Mahesh ,Published On : December 19, 2018 / 02:40 PM IST
పెద్ద పండక్కి పెట్టా తెలుగు రిలీజ్ ఫిక్స్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, సిమ్రన్, త్రిష హీరో, హీరోయిన్లుగా, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో ఆకట్టుకుంటున్న యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా.. పెట్టా.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఆడియోకి, పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా తమిళనాట ఈ సినిమాని పెద్ద ఎత్తున విడుదల చెయ్యబోతున్నారు. మామూలుగా రజినీ సినిమాలు తమిళ్‌తో పాటు, తెలుగులోనూ రిలీజవుతుంటాయి. కానీ, పెట్టా తెలుగు రిలీజ్ విషయంలో మాత్రం గతకొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. దీనికి కారణం, సంక్రాంతికి తెలుగులో భారీ సినిమాలు విడుదలవబోతుండడమే. బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకీ, వరుణ్ తేజ్‌ల ఎఫ్2, రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలు పండక్కి ఫిక్స్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో పెట్టా రిలీజ్ విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ,ఎట్టకేలకు పెట్టా సంక్రాంతికి రాబోతున్నట్టు నిర్మాత సి.కళ్యాణ్ ప్రకటించాడు. తక్కువ బడ్జెట్‌లో రూపొందడం, గతకొంత కాలంగా రజినీ సినిమాలు తెలుగులో పెద్దగా ఆడకపోవడం వంటి కారణాలతో, తక్కువ రేటుకే పెట్టా తెలుగు రైట్స్‌ని సి.కళ్యాణ్ దక్కించుకున్నాడు. తమిళ్‌లో 2019 జనవరి 10న పెట్టా రిలీజ్ కానుండగా, తెలుగు రిలీజ్ కూడా దాదాపు అదే రోజు ఉండొచ్చని తెలుస్తోంది.