Realme P3 Lite 5G Price : కిర్రాక్ ఫీచర్లతో రియల్‌మి P3 లైట్ 5G ఫోన్ వస్తోందోచ్.. ఈ నెల 13నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Realme P3 Lite 5G Price : కిర్రాక్ ఫీచర్లతో రియల్‌మి P3 లైట్ 5G ఫోన్ వస్తోందోచ్.. ఈ నెల 13నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Realme P3 Lite 5G Price

Updated On : September 11, 2025 / 7:40 PM IST

Realme P3 Lite 5G Price : రియల్‌మి P3 లైట్ 5G ఫోన్ సెప్టెంబర్ 13న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అరంగేట్రానికి కొన్ని రోజుల ముందే రియల్‌మి P3 లైట్ 5G ధరను ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ద్వారా రివీల్ చేసింది.

ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జి చిప్‌సెట్‌తో (Realme P3 Lite 5G Price) వస్తుందని టీజ్ చేసింది. 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుందని అంచనా. రియల్‌మే P3 లైట్ 5G ఫోన్ 6.67-అంగుళాల డిస్‌ప్లేతో 3 విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 32MP బ్యాక్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి.

భారత్‌లో రియల్‌మి P3 లైట్ 5G ధర :
రియల్‌మి P3 లైట్ 5G సెప్టెంబర్ 13న లాంచ్‌ కానుంది. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర, ర్యామ్, స్టోరేజ్ వివరాలను వెల్లడించింది. లిస్టింగ్ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ బేస్ 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 12,999గా ఉంటుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 13,999గా ఉంది.

Read Also : Best Android Phones : ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ కన్నా 6 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్టు పేజీ ప్రకారం.. రియల్‌మి P3 లైట్ 5G కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పై చేసిన చెల్లింపులపై కస్టమర్‌లు 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇది ‘కమింగ్ సూన్’ ట్యాగ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ సెప్టెంబర్ 13న కంపెనీ సేల్ తేదీని వెల్లడిస్తుందని భావిస్తున్నారు.

రియల్‌మి P3 లైట్ 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి P3 లైట్ 5G లిల్లీ వైట్, పర్పుల్ బ్లోసమ్, మిడ్‌నైట్ లిల్లీ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మి యూఐ 6.0, 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67 అంగుళాల HD+ (720×1,604 పిక్సెల్స్) డిస్‌ప్లేతో వస్తుంది.

రాబోయే రియల్‌మి P సిరీస్ ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 32MP బ్యాక్ కెమెరా యూనిట్, 8MP సెల్ఫీ కెమెరా, IP64-రేటెడ్ బిల్డ్ కలిగి ఉంటుంది. ఈ 5జీ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 7.94 మిమీ మందంతో ఉంటుంది.