Madhuban Mein Song: సన్నీ ‘మధుబన్’ పాటపై వివాదం.. ఈ హిందీ పాటలో ఏముంది?

ఒకప్పుడు సంగతేమో కానీ ఈ మధ్య కాలంలో సినిమాలో సన్నివేశాలు, పాటలు, మాటలు ఇలా ఏదో ఒక అంశం తరచుగా వివాదాస్పదమవుతూనే ఉంది. మేకర్స్ కావాలనే వివాదాస్పద అంశాలను తీసుకుంటున్నారో..

Madhuban Mein Song

Madhuban Mein Song: ఒకప్పుడు సంగతేమో కానీ ఈ మధ్య కాలంలో సినిమాలో సన్నివేశాలు, పాటలు, మాటలు ఇలా ఏదో ఒక అంశం తరచుగా వివాదాస్పదమవుతూనే ఉంది. మేకర్స్ కావాలనే వివాదాస్పద అంశాలను తీసుకుంటున్నారో.. లేక ప్రజలే ప్రతిదాన్ని తమకు అన్వయించుకుంటున్నారో కానీ.. మనోభావాలు దెబ్బతినడం మాట ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తుంది. బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీలియోన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సన్నీ పాట ఒకటి ఇప్పుడు వివాదాస్పదమవుతుంది.

Radhe Shyam: ఫైట్స్, ఛేజింగ్స్ ఉండవు.. ముందే ప్రిపేర్ చేసిన డైరెక్టర్!

సన్నీలియోన్ ఈ మధ్య నటించిన ‘మధుబన్‌ మే రాధిక నాచే’ వీడియో ఆల్బమ్‌ విడుదలైంది. డిసెంబర్ 22న విడుదల చేసిన ఈ సాంగ్ లో సన్నీ హాట్‌ హాట్‌గా పర్ఫామెన్స్‌ ఇచ్చింది. పాట కూడా వ్యూస్ పరంగా దూసుకెళ్తుంది. కాగా, ఉత్తర ప్రదేశ్‌లోని ప్రవిత్ర స్థలాల్లో ఒకటైన ‘మధుర’కు చెందిన పూజారులు ఆ పాటపై అభ్యంతరం వ‍్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆల్బమ్‌ను నిషేధించాలని మండిపడుతున్నారు. ఈ పాటలో సన్నీ లియోన్‌ చేసిన అశ్లీల నృత్యం తమ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. సన్నీపై ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఆల్బమ్‌ను నిషేధించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

Shraddha Srinath: అందాల ప్రదర్శనలో అంత `శ్రద్ధా`!

అయితే.. ఇంతగా ఈ పాట ఎందుకు వివాదాస్పదమవుతుందంటే.. ఇందులో రాసిన రీరిక్స్ ను బట్టి చూస్తే.. రాధ మధుబన్ లో నాట్యం చేసినట్లుగా ఉంటుంది. అయితే.. `రాధ నర్తకి కాదు.. భక్తురాలు. అలాగే మధుబన్ పవిత్ర ప్రదేశం. రాధ మధుబన్ లో ఇలా డ్యాన్స్ చేయలేదు. అందుకే అర్చక సంఘాలు, హిందూ సంఘాలు ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది సిగ్గుపడే సాహిత్యం.. సాహిత్యం విలువలే దిగజార్చేలా ఉందని నెటిజనులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. 1960లో కోహినూర్‌ సినిమాలో మహమ్మద్ రఫీ ఆలపించిన పాటను రీమేక్‌ చేసి ఇలా మధుబన్ లో రాధికా నాట్యం చేసినట్లుగా తయారుచేశారు.