Corona Positive To Katrina Kaif
Corona positive to Katrina Kaif : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కరోనా సోకింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా పాజిటివ్‌తో వెంటనే ఐసోలేట్ అయి హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. తనతో సమీపంగా మెలిగినవారంతా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.
వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తనపై చూపే ప్రేమకు, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాల్సిందిగా కత్రినా కోరారు.