Ram Jagadeesh
Ram Jagadeesh : ఇటీవల కోర్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ జగదీశ్. ఒక మంచి లవ్ స్టోరీతో పాటు ఒక మంచి మెసేజ్ ఇస్తూ కోర్ట్ రూమ్ డ్రామాగా కోర్ట్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు జగదీశ్(Ram Jagadeesh). నాని నిర్మాణంలో కేవలం 8 కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పెద్ద హిట్ అయింది.
రామ్ జగదీశ్ కోర్ట్ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత తాజాగా పెళ్లి చేసుకున్నాడు. నటుడు శివాజీ డైరెక్టర్ రామ్ జగదీశ్ రిసెప్షన్ కి హాజరయి కొత్త దంపతులను ఆశీర్వదించాడు. శివాజీ జగదీశ్ జంటతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో పలువురు ఈ డైరెక్టర్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నటుడు శివాజీ కోర్ట్ సినిమాలో మంగపతి క్యారెక్టర్ తో విలనిజం అదరగొట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read : Mouli Tanuj Prasanth : ‘మా అప్పులన్నీ తీర్చేసా.. నాన్న ఆటో నడుపుతూ..’ నువ్వు గ్రేట్ బ్రో..