Ground : ‘గ్రౌండ్’ మూవీ రివ్యూ.. సినిమా అంతా గ్రౌండ్‌లోనే.. కొత్తవాళ్లు చేసిన ఈ ప్రయత్నం చూడాల్సిందే..

ఆదివారం వస్తే దగ్గర్లో ఉండే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకునే కుర్రాళ్ళ కథ.

Cricket Based Small Film Ground Movie Review and Rating

Ground Movie Review : ఇటీవల కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. తాజాగా ఫిబ్రవరి 23న గ్రౌండ్ అనే ఓ చిన్న సినిమా విడుదలైంది. ఈ సినిమా అంతా ఆల్మోస్ట్ ఒకటే గ్రౌండ్ లో, ఒక్క రోజు జరిగే కథతో తీయడం విశేషం. దర్శక నిర్మాతగా సూరజ్ ఈ గ్రౌండ్ సినిమాని సినీ కోడ్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కించారు. తేజస్విని, దుర్గా భవాని, ప్రీతీ, హరినాథ్, నాగరాజు.. ఇలా అందరూ కొత్తవాళ్లే నటీనటులుగా నటించారు. రెండు నెలల క్రితమే రిలీజ్ అయిన గ్రౌండ్ ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి నెలకొల్పారు చిత్రయూనిట్.

కథ విషయానికొస్తే.. ఆదివారం వస్తే దగ్గర్లో ఉండే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకునే కుర్రాళ్ళ కథ. ఆదివారం క్రికెట్ ఆడటానికి వచ్చే కుర్రాళ్ళు వేరే టీంతో పోటీకి బెట్టింగ్ కట్టడం, ఆ క్రికెట్ చూడటానికి వచ్చే అమ్మాయిలు, ఆ గ్రౌండ్ లోనే క్రికెట్ ఆడే కుర్రాళ్ళు – అమ్మాయిల ప్రేమలు, బెట్టింగ్ మ్యాచ్ కాస్త సీరియస్ గా మారడం, దీంతో రెండు గ్రూపుల మధ్య గొడవలు, ప్రేమికుల మధ్య గొడవలతో సాగింది. మరి ఆ గొడవలు ఏంటి? గొడవ తర్వాత ఏమైంది? గ్రౌండ్ కథేంటి? ప్రేమ జంటల కథేంటి తెలియాలంటే తెరపై గ్రౌండ్ సినిమాని చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. గ్రౌండ్ సినిమాని రెగ్యులర్ సినిమాగా కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలా తెరకెక్కించారు. సినిమా అంతా ఒకటే గ్రౌండ్, ఆ చుట్టుపక్కల ఉండే లొకేషన్స్ లో తీయడం గమనార్హం. క్రికెట్ మీద చాలా సినిమాలు వచ్చినా ఇది పూర్తిగా భిన్నమైన కథ. గ్రౌండ్ సినిమా చూస్తున్నంతసేపు చిన్నప్పుడు మనం ఆదివారం వస్తే క్రికెట్ ఆడటానికి వెళ్లిన సంగతులు, క్రికెట్ లో పడ్డ గొడవలు, అక్కడి ఎంజాయిమెంట్ అంతా గుర్తొస్తుంది. కాకపోతే సినిమా కొంచెం స్లోగా సాగినట్టు అనిపిస్తుంది.

Also Read : Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ రిలీజ్.. కోపాన్ని వారంలో ఒక్కరోజే చూపించే పిచ్చోడు..

నటీనటుల విషయానికొస్తే.. అందరూ కొత్తవాళ్లే అయినా పర్వాలేదనిపించారు. క్రికెట్ టీం కెప్టెన్ గా హరి, ముగ్గురు అమ్మాయిలు తేజస్విని, దుర్గా భవాని, ప్రీతీ చక్కగా నటించారు.

సాంకేతిక అంశాలు.. చిన్న సినిమా, బడ్జెట్ లిమిట్స్ ఉండటం, దర్శకుడే నిర్మాత కావడంతో సినిమా క్వాలిటీ మాత్రం కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. అయితే అది కవర్ చేయడానికే సినిమాని న్యాచురల్ లైట్, న్యాచురల్ సౌండ్స్ తో రియాలిటీకి దగ్గరగా తీసి మెప్పించారు. దీంతో మనం నిజంగా గ్రౌండ్ లో ఉండి ఆడితే ఎలా అనిపిస్తుంది ఈ సినిమా చూసినప్పుడు అదే ఫీలింగ్ కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే అనిపిస్తాయి. ఓ న్యాచురల్ కథని ప్రేక్షకులకి పరిచయం చేసినా కథనంలో కూడా ప్రేమ, క్రికెట్ చూపించినా అక్కడక్కడా సాగదీసినట్టు అనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి దర్శకుడిగా మారి ఎలాంటి అనుభవం లేకుండా తనకి అందుబాటులో ఉన్న వాటితోనే ఇలాంటి ఒక గ్రౌండ్ సినిమాని తీసినందుకు మాత్రం దర్శకుడు సూరజ్ ని అభినందించొచ్చు.

మొత్తంగా గ్రౌండ్ సినిమా ఓ గల్లీ క్రికెట్ కథనంతో ఒక్క రోజులో ఒకే గ్రౌండ్ లో జరిగిన కథ. రియాలిటీ సినిమాలు, గల్లీ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు కచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో చూడాల్సిందే. అలాగే చిన్నప్పటి క్రికెట్ జ్ఞాపకాలు గుర్తుచేసుకోవాలన్నా ఈ సినిమాని చూసేయొచ్చు. గ్రౌండ్ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

మనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే..

ట్రెండింగ్ వార్తలు