Ashwin : కొత్త స్టైల్‌లో ‘పుష్ప’ పాటకి స్టెప్పులేసిన మరో క్రికెటర్
ఇక క్రికెటర్స్ అయితే రోజుకొకరు 'పుష్ప' పాటలకి స్టెప్పులేస్తున్నారు. ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా.. ఇలా చాలామంది.....

Ashwin
Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా ఫీవర్ రోజు రోజుకి తగ్గేదేలే అన్నట్టు పెరిగిపోతుంది. సినిమా రిలీజ్ అయి నెల రోజులు దాటినా ఇంకా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఒక పక్క తగ్గేదేలే అంటూ డైలాగ్స్, మరో పక్క పుష్ప సాంగ్స్ తో రీల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కేవలం అభిమానులే కాదు, దేశ విదేశాల్లో సినిమా స్టార్లు, సెలబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు.. ఇలా అందరూ పుష్ప పాటలతో, డైలాగ్స్ తో రీల్స్ చేసి వైరల్ చేస్తున్నారు. శ్రీవల్లి సాంగ్, ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్, తగ్గేదేలే డైలాగ్స్ కి సంబంధించిన రీల్స్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.
ఇక క్రికెటర్స్ అయితే రోజుకొకరు ‘పుష్ప’ పాటలకి స్టెప్పులేస్తున్నారు. ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా.. ఇలా చాలామంది ‘పుష్ప’ సినిమాలోని పాటలకి స్టెప్పులు వేశారు. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. తన ఫ్యామిలీతో కలిసి ‘పుష్ప’పై రోజుకో వీడియో చేసి షేర్ చేస్తున్నాడు. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన స్టైల్ లో కొత్తగా పుష్పలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు.
Madhu Bala : ‘శ్యామ్ సింగరాయ్’ చూసి సాయి పల్లవిని పొగిడిన అలనాటి అందాల తార
బన్నీ స్టెప్పుకి మరింత కొత్తగా క్రికెట్ బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ చేస్తున్నట్టు చేస్తూ శ్రీవల్లి పాటకి స్టెప్పులేశాడు. పక్కన తన స్నేహితుడు కూడా అశ్విన్ తో కలిసి ఈ కొత్త రకం స్టెప్పు వేసాడు. ప్రస్తుతం ఈ స్టెప్పు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులు క్రికెటర్ అనిపించుకున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టెప్పు మాత్రం ఇరగదీశావ్ అంటూ వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు బన్నీ అభిమానులు.