Chiranjeevi : చిరంజీవి సరదాగా చేసిన కామెంట్స్ పై విమర్శలు.. వారసుడు కావాలని కోరుకోవడంతో..

తాజాగా ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ పై కూడా విమర్శలు చేస్తున్నారు.

Criticism on comments made by Chiranjeevi in ​​Brahma Anandam event

Chiranjeevi : ఇటీవల సోషల్ మీడియాలో నెగిటివిటి ఎక్కువయిపోయిన సంగతి తెలిసిందే. ప్రతి మాటను నెగిటివ్ గానే అర్ధం చేసుకుంటూ నెగిటివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెగిటివిటి తగ్గాలి అనే వాళ్ళు కూడా కొన్ని సార్లు నెగిటివిటినే ప్రమోట్ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు ఏదైనా అనుకోకుండానో, సరదాగానో చేసిన కామెంట్స్ ని కూడా నెగిటివ్ గా చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల లైలా ఈవెంట్లో ఓ నటుడు సినిమాలో జరిగిన సీన్ గురించి చెప్పినా దాన్ని దేనికో కనెక్ట్ చేసుకొని ఆ కామెంట్స్ పై పెద్ద దుమారమే లేపారు కొంతమంది.

తాజాగా ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. నిన్న బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమా తాత – మనవడు రిలేషన్ మీద కావడంతో యాంకర్ సుమ అక్కడున్న వారందరిని తాత రిలేషన్ గురించి సరదాగా ప్రశ్నలు అడిగింది. ఈ క్రమంలో స్క్రీన్ పై చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి దిగిన ఫోటో వేయడంతో చిరంజీవి మాట్లాడుతూ.. ఇంట్లో నా గ్రాండ్ డాటర్స్ అందరితో ఉంటే ఒక లేడీ హాస్టల్ లాగా ఉంటుంది. వాళ్లకు నేను ఒక వార్డెన్ లాగా అనిపిస్తాను అన్నారు. అలాగే ఈ సారైనా చరణ్ ని మగపిల్లాడిని కనమని చెప్పినట్టు, లెగసి కంటిన్యూ అవ్వాలని కోరిక అని అన్నారు. మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో భయం అని అన్నారు.

Also Read : Chiranjeevi : మగ పిల్లాడు కావాలి- బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

సుమ సరదాగా అడగడంతో చిరు కూడా నవ్వుతూనే సరదాగా చెప్పారు. చిరు కామెంట్స్ కి ఈవెంట్లో ఉన్నవాళ్ళంతా సరదాగానే నవ్వారు. అయితే పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో చిరంజీవి చేసిన కామెంట్స్ పై విమర్శలు చేస్తున్నారు. ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడారని, ఇంకా సమాజంలో ఆడపిల్లలు వద్దనేలా మాట్లాడారని, సమాజం ఎంత మారుతున్నా ఇంకా ఆడపిల్లల్ని తొక్కేస్తున్నారని, ఆడపిల్లల్ని తక్కువగా చూస్తున్నారని, చిరంజీవి లాంటి వ్యక్తే ఇలా అంటే సాధారణ ప్రజలు ఏమనుకుంటారని.. ఇలా రకరకాల విమర్శలు చేస్తూ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా మహిళా కమిషన్ చిరంజీవిపై చర్యలు తీసుకోవాలని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో యాంటి ఫ్యాన్స్, మరికొంతమంది రాజకీయ వ్యతిరేకులు కూడా చిరంజీవి కామెంట్స్ ని విమర్శిస్తూ దీన్ని వివాదంలా మారుస్తున్నారు.

అయితే పలువురు మెగా ఫ్యాన్స్, నెటిజన్లు మాత్రం సరదాగా చేసిన వ్యాఖ్యలను ఇలా నెగిటివ్ గా ప్రమోట్ చేయడం ఏంటి అని, అయినా చిరంజీవి తన చెల్లెళ్లకు ఎన్ని కోట్లు ఫ్రీగా కానుకలుగా ఇచ్చాడు, తన కూతుళ్లు, తన మనవరాళ్లను ఎంత బాగా చూసుకుంటాడో అందరికి తెలుసు కదా, క్లిన్ కారా పుట్టినప్పుడు అందరికంటే చిరు ఎంత సంబరపడ్డారో వీడియోలు అందరూ చూసారు కదా, మెగాస్టార్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఒక మగపిల్లాడు పుట్టి మెగా లెగసిని కంటిన్యూ చేయాలని కోరుకున్నాడు, ఒక తాతగా మనవడు కావలి అనుకున్నాడు, దానికి ఎందుకు పెడార్థాలు తీసి విమర్శలు చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Chiranjeevi : మా తాత మంచి రసికుడు.. తన తాతయ్య గురించి చిరంజీవి ఆసక్తికర కామెంట్స్..

మెగా ఫ్యాన్స్ కూడా అకిరా సినిమాల్లో హీరోగా రాడు అని క్లారిటీ వచ్చిన తర్వాత తమ మెగా లెగసిని కంటిన్యూ చేయడానికి చరణ్ కి ఒక వారసుడు ఉంటే బాగుండు అని ఎప్పట్నుంచో అంటున్నారు. ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ నిజం అయి చరణ్ కి కొడుకు పుడితే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటుంటే మరో వైపు ఇలా పలువురు ఆడపిల్లల్ని చిరంజీవి తక్కువగా చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. మరి ఈ వివాదంపై చిరంజీవి స్పందిస్తారా చూడాలి.