Chiranjeevi : మగ పిల్లాడు కావాలి- బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
చిరంజీవి అలా అనడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరబూశాయి.

Chiranjeevi : బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక మగ పిల్లాడు కావాలని ఆయన అన్నారు. అదేంటి.. మగ పిల్లాడు కావాలని అడగటం ఏంటి అనే సందేహం వచ్చింది కదూ.. మ్యాటర్ ఏంటంటే.. తన ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారని చిరంజీవి చెప్పారు. ఇంట్లో ఉన్నప్పుడు తనకు తన మనవరాళ్లతో ఉన్నట్లు ఉండదని అన్నారు.
తన ఇంట్లో ఉన్న ఆడపిల్లలను చూస్తే.. ఓ లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంటుందని ఆయన కామెంట్ చేశారు. అందుకే, తన కొడుకు రాంచరణ్ తో.. ఈసారికైనా అబ్బాయిని కనరా అని అన్నానని సరదాగా చెప్పారు చిరంజీవి. ఈసారికైనా మగపిల్లాడిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలని నా కోరిక అని చరణ్ తో అన్నట్లు చిరంజీవి చెప్పారు. చిరంజీవి అలా అనడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరబూశాయి.
”ఇంట్లో ఉన్నప్పుడు నాకు మా మనవరాళ్లతో ఉన్నట్లు ఉండదు. ఓ లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంటుంది నాకు. చుట్టూ ఆడపిల్లలే. చరణ్ ఈసారికికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక” అని చిరంజీవి అన్నారు.
Also Read : రాజకీయాల్లోకి రీఎంట్రీపై.. చిరంజీవి సంచలన ప్రకటన
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా.. ఓ ఫోటోని డిస్ ప్లే చేశారు. ఆ ఫోటోలో చిరంజీవి తన ఇంట్లో తన మనవరాళ్లతో ఉంటారు. ఆ ఫోటో చూసిన సందర్భంలో ఆయనిలా మగపిల్లాడు కావాలని ఉందని కామెంట్ చేశారు. మొత్తంగా చిరంజీవి తన మనసులో మాటను ఇలా బయట పెట్టేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మా తాత రసికుడు..
ఇక, ఇదే ఈవెంట్ లో తన తాత గురించి చిరంజీవి సరదా వ్యాఖ్యలు చేశారు. తన తాత పేరు రాధాకృష్ణనాయుడు అని తెలిపారు. తనకు ఆయన పోలికలు మాత్రం రావొద్దని ఇంట్లో అంటుంటే వారట. ఎందుకంటే ఆయన రసికుడు అని చిరంజీవి అన్నారు. తనకు ఇంట్లోనే ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారని చెప్పారు. వారి మీద అలిగినప్పుడు ఆయన మరో ఆమె వద్దకు వెళ్లే వారని అన్నారు. కానీ, తన తాత చాలా దానధర్మాలు చేసేవారని, అదొక్కటే తాను అందిపుచ్చుకున్నానని చిరంజీవి సరదాగా అన్నారు. చిరు వ్యాఖ్యలతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరబూసాయి.