Chiranjeevi : మా తాత మంచి రసికుడు.. తన తాతయ్య గురించి చిరంజీవి ఆసక్తికర కామెంట్స్..
స్క్రీన్ పై చిరంజీవి తాత ఫోటో చూపించి ఆయన గురించి చెప్పమనడంతో చిరంజీవి..

Chiranjeevi Interesting comments on his Grand Father in Brahma Anandam Movie Pre Release Event
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. అది అవ్వగానే శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు లైన్లో పెట్టారు. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నా మరో పక్క వేరే సినిమాలకు సపోర్ట్ ఇవ్వడానికి ఈవెంట్స్ కు గెస్ట్ గా వస్తున్నారు. మొన్న విశ్వక్ సేన్ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. నిన్న బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు మెగాస్టార్.
రాహుల్ యాదవ్ నక్క నిర్మాణంలో నిఖిల్ దర్శకత్వంలో బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ కలిసి చేస్తున్న సినిమా బ్రహ్మ ఆనందం. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడంతో బ్రహ్మానందంతో ఉన్న అనుబంధంతో గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో యాంకర్ సుమ పలువురిని కొన్ని సరదా ప్రశ్నలు అడగడంతో అందులో భాగంగా చిరంజీవి తాతయ్య గురించి ఓ ప్రశ్న అడిగారు.
Also Read : Chiranjeevi : మగ పిల్లాడు కావాలి- బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
స్క్రీన్ పై చిరంజీవి తాత ఫోటో చూపించి ఆయన గురించి చెప్పమనడంతో చిరంజీవి.. ఆయన మా అమ్మగారి తండ్రి. ఆయన పేరు రాధాకృష్ణమ నాయుడు. మొదట నెల్లూరులో ఉండేవారు. తర్వాత మొగల్తూరుకు షిఫ్ట్ అయ్యారు. ఎక్సైజ్ ఇనస్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. నీకు ఎవరి పోలికలు, ఎవరి బుద్దులు అయినా రావచ్చు కానీ ఆయన బుద్దులు మాత్రం రాకూడదు అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు. ఇంట్లోనే ఉండేవారు. వీరిద్దరి మీద అలిగితే బయట ఇంకొకరు మూడోవాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్తారు. నాకు తెలిసి మూడు. నాలుగు, ఐదు కూడా ఉన్నాయేమో నాకు తెలీదు. నేను సినీ పరిశ్రమకు వెళ్తాను అన్నప్పుడు ఇక్కడ అలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయని, ఆయన్ని మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పి పంపించారు. అందుకే నేను మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోలేదు. కానీ ఆయన చాలా దానధర్మాలు చేసేవాళ్ళు. అది ఒక్కటి మాత్రం కొంచెం అందిపుచ్చుకున్నాను అని తెలిపారు.
Also Read : Chiranjeevi : రాజకీయాల్లోకి రీఎంట్రీపై.. చిరంజీవి సంచలన ప్రకటన
దీంతో సభలో చిరంజీవి కామెంట్స్ కి నవ్వులు హోరెత్తాయి. చిరంజీవి తన తాతయ్య గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.