School Life : క్రౌడ్ ఫండింగ్ తో ‘స్కూల్ లైఫ్’ సినిమా..

నైనీషా క్రియేషన్స్ తో పాటు క్రౌడ్ ఫండింగ్ మీద తెరకెక్కుతున్న సినిమా 'స్కూల్ లైఫ్'.

School Life : క్రౌడ్ ఫండింగ్ తో ‘స్కూల్ లైఫ్’ సినిమా..

Croud Funded Movie School Life started with Kiran Abbavaram Clap

Updated On : July 22, 2024 / 9:30 AM IST

School Life : పులివెందుల మహేష్ హీరో, దర్శకుడుగా సావిత్రి కృష్ణ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘స్కూల్ లైఫ్’. నైనీషా క్రియేషన్స్ తో పాటు క్రౌడ్ ఫండింగ్ మీద నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మాతలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించగా హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు వి సముద్ర అతిథులుగా వచ్చారు. కిరణ్ సబ్బవరం హీరో, హీరోయిన్స్ మీద క్లాప్ కొట్టారు.

సినిమా పూజా కార్యక్రమం అనంతరం స్కూల్ లైఫ్ హీరో, దర్శకుడు పులివెందుల మహేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా నా ఒక్కడిదే కాదు. సినిమా మీద ఉన్న ఇష్టంతో సినిమా కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన ప్రజల డబ్బుతో, అలాగే నా ఇల్లు కూడా అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. బడ్జెట్ సరిపోదు అనుకున్నప్పుడు నిర్మాత రాహుల్ త్రిశూల్ నాకు సపోర్ట్ ఇచ్చి ఇవాళ రామానాయుడు స్టూడియోలో మూవీ ఓపెనింగ్ చేయించారు. సినిమాలతో బిజీగా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం గారికి, దర్శకుడు సముద్ర గారికి కృతజ్ఞతలు అని తెలిపారు.

Also Read : Prabhas – Sjala Ali : ప్రభాస్ కోసం పాకిస్థాన్ నుంచి ఆ నటి..?

నిర్మాత రాహుల్ త్రిశూల్ మాట్లాడుతూ.. గతంలో నేను రాంగోపాల్ వర్మ సినిమా కథని ఓటిటికి తెరకెక్కించారు. యాంకర్ రవి హీరోగా రాయలసీమ ప్రేమ కథ అని రెండు సినిమాలు చేశాను. ఇది నాకు మూడో సినిమా. మహేష్ చెప్పిన కథ నచ్చి ఇందులో నిర్మాతగా భాగమయ్యాను. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఆగస్టు 2న మొదలయి సెప్టెంబర్ 2 వరకు సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయనున్నాం అని తెలిపారు.

అతిథిగా విచ్చేసిన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మహేష్ కి, రాహుల్ త్రిశూల్ కి ధన్యవాదాలు. రాయలసీమ నుంచి వచ్చిన ఎంతోమంది సినీ పరిశ్రమలో సక్సెస్ అయ్యారు. వాళ్లలాగే మహేష్ కూడా సక్సెస్ అవ్వాలి, ఈ స్కూల్ లైఫ్ సినిమా హిట్ అవ్వాలి అని అన్నారు.