Police
Pushpa: పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప సినిమా వరల్డ్ వైడ్‌గా కలెక్షన్ కింగ్‌గా నిలుస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో భారీ వసూళ్లు రాబడుతోంది. విడుదలైన మొదటిరోజే అన్ని లాంగ్వేజెస్ కలిపి 70 కోట్ల రూపాయలు వసూల్ చేసింది పుష్ప. విడుదలైన ప్రతీచోట సినిమాపై పాజిటివ్ టాక్ రాగా.. అభిమానులు ఉత్సాహంగా సినిమా కోసం పరుగులు తీస్తున్నారు.
ఈ క్రమంలోనే పుష్ప మూవీని క్రేజీగా వాడేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. పుష్పరాజ్‌గా హెల్మెట్, సైడ్ మిర్రర్స్ లేకుండా బన్నీ బైక్ మీద వెళ్లే ఫోటోని పోస్ట్ చేసి.. హెల్మెట్, సైడ్ మిర్రర్స్ లేవా పుష్ప అంటూ ఫహాద్ ఫాజిల్ డైలాగ్ యాడ్ చేసిన పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పుష్ప మూవీలో ఫోటోలను యూజ్ చేసి పోలీసులు చేసిన మెమీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన, యాక్షన్ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు ‘పార్ట్-2’ కూడా ఉంది.
‘పుష్ప: ది రూల్’(Pushpa: The rule) టైటిల్‌తో సెకండ్ పార్ట్ రాబోతుంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉండగా.. తొలి భాగంలో ఓ కూలీగా జీవితం మొదలు పెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది కథాంశం.
Wear Helmet & Fix Rearview Mirrors. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad #Pushpa #PushpaRaj pic.twitter.com/USlupBLHIR
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 17, 2021