Dance choreographer Prem Rakshit is planning an international level film with Prabhas.
Prabhas-Prem rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల గురించి, ఆయన లైనప్ గురించి(Prabhas-Prem rakshith) ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేస్తున్న ఒక్కో సినిమా చూస్తూనే బాక్సాఫీస్ కి ముచ్చెమటలు పెట్టె అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ, సాలార్ 2, కల్కి 2 ఇలా ఒక్కో సినిమా ఒక్కో రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. ఈ రేంజ్ పాన్ ఇండియా సినిమాలు వేరే ఏ హీరోకి లేకపోవడం గమనార్హం. దీంతో ఈ లైనప్ చూసి ఆయన ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ గా ఉన్నారు. అయితే, ఈ క్రేజీ లైనప్ లోకి మరో మూవీ చేరింది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యాజికల్ డాన్స్ మూమెంట్స్ క్క్రియేట్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ పోతినేని, రవి తేజ, నితిన్ ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోలకి ఆయన డాన్స్ కొరియోగ్రఫీ అందించాడు. ఇక ఆర్ఆర్ఆర్ ఆయన డాన్స్ మూమెంట్స్ అందించిన నాటు నాటు సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు సైతం వరించింది. నిజానికి ఈ పాట విజయంలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫ్ చేసిన డాన్స్ మూమెంట్స్ ప్రధాన కారణం అనే చెప్పాలి. ఆస్కార్ రావడానికి కూడా అదే కారణం.
అలాంటి ప్రేమ్ రక్షిత్ రీసెంట్ గా అద్భుతమైన కథను ప్రభాస్ కి వినిపించాడట. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు అలాంటి కథతో సినిమా రాలేదని తెలుస్తోంది. ఈ రీసెంట్ గా ఈ కథను ప్రభాస్ కి వినిపించడంతో పబాగా నచ్చేసిందట. వెంటనే ఒకే చెప్పేశాడట. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే ప్రేమ్ రక్షిత్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట ప్రభాస్. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో రానున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి తన మొదటి సినిమాతో ప్రేమ్ రక్షిత్ ఆడియన్స్ ను ఎలా సాటిస్ఫై చేస్తాడు అనేది చూడాలి.