Manchu Lakshmi: బోల్డ్ గా మాట్లాడితే, బొడ్డు కనిపిస్తే తప్పేంటి.. అవి విని చాలా ఏడ్చాను.. కానీ అక్కడ అలా..
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. (Manchu Lakshmi)మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి ముందు నిర్మాతగా పరిచయమై తరువాత నటిగా, హీరోయిన్ గా మారింది.
Manchu Lakshmi shocking comments on skin and glamour show
Manchu Lakshmi: టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి ముందు నిర్మాతగా పరిచయమై తరువాత నటిగా, హీరోయిన్ గా మారింది. సినిమాపై తనకున్న(Manchu Lakshmi) ప్యాషన్ తో ఇండస్ట్రీలో ఉంటూ తన అభిరుచికి తగ్గ సినిమాలు చేస్తూ వస్తోంది. రీసెంట్ గానే ఆమె దక్ష అనే సినిమాలో నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అవలేదు. నటిగా పక్కన పెడితే విమెన్ ఎంపీవర్ మెంట్ గురించి కూడా ఆమె కామెంట్స్ చేస్తూ ఉంటారు.
The Paradise: ది ప్యారడైజ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
మహిళకు ఇంట్లోనే ఉండిపోకుండా తమకు నచ్చిన దారిలో ముందుకు వెళ్లాలని సూచిస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆమె ‘ది మేల్ ఫెమినిస్ట్’ అనే పాపులర్ పోడ్‌కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ పోడ్ కాస్ట్ లో ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన, సినిమా రంగంలో ఎదుర్కొన్న సమస్యలు, టాలీవుడ్-బాలీవుడ్ లాంటి చాలా టాపిక్స్ పైన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ పోడ్ కాస్ట్ లో ఆమె మాట్లాడుతూ.. “సెలబ్రెటీ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు అన్ని సులువుగా దొరికేస్తాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ, నేను కూడా చాలా విమర్శలను ఎదుర్కొన్నాను. వాటిని తలుచుకొని రాత్రిళ్ళు ఏడ్చేదాన్ని. డ్రెస్సింగ్ విషయానికి వస్తే, సౌత్ – నార్త్ లో చాలా తేడాలు ఉంటాయి.
పద్దతుల పేరుతో ఇక్కడ మహిళలపై ఒత్తడికి గురి చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో సీన్స్ తగ్గట్టుగా బొడ్డు కనిపించే ఛాన్స్ ఉంటుంది. అది కూడా తప్పేనా? అది ఆర్ట్.
మహిళల శరీరాన్ని ఈ సమాజం తప్పుగా చూస్తుంది. బాలీవుడ్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. ఇక సర్జరీలు చేయించుకోవడం అనేది వ్యక్తిగత నిర్ణయం అందులో తప్పేం లేదు. నేను హాలీవుడ్ లో కూడా వర్క్ చేశాను. అక్కడ వర్క్ కల్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ స్కూల్ లైఫ్ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పిస్తారు. కానీ, ఇక్కడ దాని గురించి మాట్లాడితే చాలా తప్పుగా చూస్తారు. ఇవన్నీ మారాల్సిన సమయం వచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
