The Paradise: ది ప్యారడైజ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నాడు. ఆయన నుంచి వస్తున్న దాదాపు అన్ని సినిమాలు (The Paradise)బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన హిట్ 3 బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Nani 'The Paradise' movie first song released on December
The Paradise: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నాడు. ఆయన నుంచి వస్తున్న దాదాపు (The Paradise)అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన హిట్ 3 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాడు నాని. ఇక ఈ సినిమా తరువాత నాని ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. దసరా తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కు ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. నాని లుక్ కూడా మాములుగా లేదు. ఆయన ఈ సినిమాలో ‘గే’ పాత్రలో కనిపించనున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అఖండ 2 మళ్ళీ వాయిదా..?
పాన్ ఇండియా లెవల్లో సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా 2026 మర్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, ది ప్యారడైజ్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అందుకే, ఈ మూవీ సాంగ్స్ పై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ సినిమా ఫస్ట్ సాంగ్ ను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ న్యూస్ తెలియడంతో నాని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.
