DanceIkon2Wildfire coming soon on aha
తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ హిట్ మూవీస్, అదిరిపోయే గేమ్ షోలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లను అందిస్తూ ఆడియెన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తోంది. బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీ చరిత్రలో మునుపెన్నడూ లేని సరికొత్త ప్రోగ్రామ్స్‌ను రూపొందిస్తూ డిజిటల్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది ఆహా. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన డాన్సర్ల కోసం గతంలో డాన్స్ ఐకాన్ షోను తీసుకువచ్చింది.
2022లో వచ్చిన డాన్స్ ఐకాన్ షోను మంచి స్పందన వచ్చింది. మరో సారి ఈ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. డాన్స్ ఐకాన్ 2 అనే పేరుతో రానుంది. యాంకర్ ఓంకార్ హోస్ట్‌గా, నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే డాన్స్ ఐకాన్ 2 కోసం ఆడిషన్స్ పూర్తి అయ్యాయి.
Anand Devarakonda- Vaishnavi Chaitanya : ‘బేబి’ కాంబోలో మరో మూవీ.. దర్శకుడు ఎవరో తెలుసా?
ఈ షోలో మునుపెన్నడూ చూడని కాన్సెప్ట్‌లు, సిజ్లింగ్ పెర్ఫార్మెన్స్‌లు, ప్రతి ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలేలా అనిపించే ఎలక్ట్రిక్ వాతావరణం ఉంటుందని టీమ్ తెలిపింది. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్‌ఫైర్ త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు చెప్పింది. ఇక ఈ షో కోసం ఆడియెన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.