Dasara Movie Director Slams Rumours Of Shoot Halt
Dasara: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇప్పటికే 30 శాతం మేర షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే నాని నటించిన మరో చిత్రం ‘అంటే సుందరానికీ’ చిత్ర రిలీజ్ కోసం ప్రమోషన్స్ చేసేందందుకు దసరా చిత్ర షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈలోపే సోషల్ మీడియాలో ఈ సినిమా ఆగిపోయిందంటూ అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దసరా చిత్ర దర్శకడు శ్రీకాంత్ ఓదెల, చిత్ర నిర్మాతల మధ్య విభేదాలు రావడంతో ఈ సినిమా షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లుగా సోషల్ మీడియా కోడై కూసింది.
Dasara: దసరా బరిలో ఇద్దరు సీనియర్లు, ఒక జూనియర్!
అయితే తాజాగా ఈ వార్తలపై చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనదైన మార్క్ పంచ్ వేశాడు. ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు బ్రహ్మానందం మీమ్‌తో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేశాడు. ఈ స్ట్రాంగ్ కౌంటర్‌తో దసరా సినిమా షూటింగ్ ఆగిపోలేదని కన్ఫం చేశాడు ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నాని పూర్తి ఊరమాస్ అవతరాంలో ఈ సినిమాలో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు రెడీ అయ్యాడు.
Dasara: ఆలస్యంగా రానున్న దసరా.. పండగ లేనట్టేనా?
తెలంగాణ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
https://t.co/oc0uFhyp2k pic.twitter.com/X9H3aJNHfD
— srikanth odela (@odela_srikanth) June 29, 2022