Dasara: దసరా బరిలో ఇద్దరు సీనియర్లు, ఒక జూనియర్!

టాలీవుడ్‌లో పండగ సీజన్‌లో వచ్చే సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందుకే చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలను పండగ సీజన్‌లో రిలీజ్ చేసేందుకు....

Dasara: దసరా బరిలో ఇద్దరు సీనియర్లు, ఒక జూనియర్!

Dasara: టాలీవుడ్‌లో పండగ సీజన్‌లో వచ్చే సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందుకే చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలను పండగ సీజన్‌లో రిలీజ్ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఈసారి దసరా సీజన్‌లో కూడా ఇలాంటి పరిస్థితే మనకు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోని అందరూ హీరోలు కూడా తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే వీరందరూ తమతమ సినిమాలను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని వారి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈసారి దసరా పండగ బరిలో ముగ్గురు హీరోలు తలపడేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Chiranjeevi : మెగాస్టార్‌కి ఎవరు మెగా హిట్ ఇస్తారు??

దసరా పండగకు వరుస సెలవులు వస్తుండటంతో ఈ పండగ సీజన్‌ను పూర్తిగా వినియోగించుకోవాలని పలువురు స్టార్స్ చూస్తున్నారు. కానీ.. వారిలో ముందు వరుసలో మాత్రం ఇద్దరు సీనియర్ హీరోలు, ఒక జూనియర్ హీరో రెడీగా ఉన్నట్లుగా చిత్ర వర్గాలు అంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ చిత్రం చివరిదశకు చేరుకోవడంతో, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కాస్త సమయం తీసుకుని, సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అటు మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో, ఈ సినిమాను కూడా దసరా టార్గెట్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

NBK107: బాలయ్య అలాంటి డైలాగులు చెబుతాడా?

అటు యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలని అనుకున్నా, ఇంకా షూటింగ్ పనులు ముగియకపోవడంతో, ఈ సినిమాను కూడా దసరా బరిలో రిలీజ్ చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడట. దీంతో ఈసారి దసరా బరిలో ఇద్దరు సీనియర్లు, ఒక జూనియర్ పోటీ పడుతుండటం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. మరి ఈ ముగ్గురిలో దసరా బరిలో చివరివరకు ఎవరూ పోటీలో ఉంటారో, ఎవరు పోటీ నుండి తప్పుకుంటారో చూడాలి.