Sanjana Galrani : డ్రగ్స్ కేసులో అరెస్ట్.. అయిదు నెలల పాపను వదిలి.. ఆల్రెడీ బిగ్ బాస్ అనుభవం..

(Sanjana Galrani)నటిగా సినిమాలు చేస్తున్న సమయంలో కరోనా ముందు 2020 లో సంజనాను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసారు.

Sanjana Galrani : డ్రగ్స్ కేసులో అరెస్ట్.. అయిదు నెలల పాపను వదిలి.. ఆల్రెడీ బిగ్ బాస్ అనుభవం..

Sanjana Galrani

Updated On : September 8, 2025 / 8:05 AM IST

Sanjana Galrani : సంజన గల్రాని తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి అడుగుపెట్టింది. ప్రభాస్ బుజ్జి గాడు సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంది ఈ భామ. కన్నడకు చెందిన ఈ నటి తెలుగులో సోగ్గాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి యమహా యమ, సర్దార్ గబ్బర్ సింగ్ తో పాటు చాలా సినిమాల్లో నటించింది. కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా నటించింది.

నటిగా సినిమాలు చేస్తున్న సమయంలో కరోనా ముందు 2020 లో సంజనాను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసారు. కొన్నాళ్ళు జైలులో ఉండి అనంతరం బెయిల్ పై బయటకు వచ్చింది. తర్వాత హైకోర్టులో తనకు క్లీన్ చిట్ లభించింది. జైలుకు వెళ్లడంతో సంజనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో సంజన సినిమాలు మానేసి ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.

Also See : Sai Pallavi Sister : సాయి పల్లవి చెల్లి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తతో స్పెషల్ ఫొటోలు..

సంజన గతంలో కన్నడ బిగ్ బాస్ మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది. దీంతో ఆమెకు బిగ్ బాస్ అనుభవం ఉంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తెలుగు బిగ్ బాస్ తో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరవుతుంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంజన తన తప్పు లేకుండానే డ్రగ్స్ కేసులో ఇరికించారని చెప్తూ ఎమోషనల్ అయింది.

అలాగే సంజన 2021 లో పెళ్లి చేసుకుంది. 2022 లో సంజన – అజీజ్ పాషా జంటకు ఒక బాబు పుట్టగా ఇటీవలే ఒక పాప పుట్టింది. అయిదు నెలల పాపని ఇంట్లో వాళ్లకు అప్పగించి తాను బిగ్ బాస్ కి రావడం గమనార్హం. మరి సంజన బిగ్ బాస్ లో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

Also See : Anikha surendran : ఆహా అనికా.. చీరలో అందంగా.. ఫ్యామిలీతో కలిసి ఓనం సెలబ్రేషన్స్..