Pitru Paksham 2025 : పితృపక్షం.. పితృ దోషాల వల్ల కలిగే నష్టాలేమిటి..? ఇలాచేస్తే పూర్వీకుల ఆశీర్వాదం పొందొచ్చు..

పితృపక్షాల (Pitru Paksha 2025) సమయంలో పితృదేవతలు భూమిని సందర్శిస్తారని నమ్మకం. వారికి స్వాగతం పలికేందుకు అనువుగా ఇంట్లో వాతావరణం ఉండాలి.

Pitru Paksham 2025 : పితృపక్షం.. పితృ దోషాల వల్ల కలిగే నష్టాలేమిటి..? ఇలాచేస్తే పూర్వీకుల ఆశీర్వాదం పొందొచ్చు..

Pitru Paksha 2025

Updated On : September 8, 2025 / 8:04 AM IST

Pitru Paksham 2025 : పితృపక్షాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈసారి పితృపక్షాలు గ్రహణంతో మొదలై గ్రహణంతోనే ముగియనున్నాయి. ఈ సంవత్సరం పితృపక్షాలు సంపూర్ణ చంద్రగ్రహణం రోజు (సెప్టెంబర్ 7వ తేదీ) నుంచి మొదలై సెప్టెంబర్ 21వ తేదీన సూర్యగ్రహణంతో ముగుస్తాయి. భాద్రపద శుక్ల పౌర్ణమి నుంచి అశ్వినీ కృష్ణ అమావాస్య అంటే మహాలయ అమావాస్యతో పూర్తవుతాయన్నమాట.

Also Read: Pitru Paksha 2025: పితృపక్షం.. ఈ సమయంలో ఈ పనులు అస్సలు చేయకూడదు..! లేదంటే..

పితృపక్షాలు ప్రతీఏటా పక్షం రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలు భూమిని సందర్శిస్తారని నమ్మకం. వారికి స్వాగతం పలికేందుకు అనువుగా ఇంట్లో వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి.

ముఖ్యంగా పితృపక్షాల రోజుల్లో ఇంటిని శుద్ధి చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది. పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో పితృదేవతల శక్తి ప్రసారానికి అనువైన పరిస్థితులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

ఇంటి నైరుతి మూలను పితృస్థానంగా చెబుతున్నారు. ఈ దిశలో పితృదేవతలు కొలువు ఉంటారని నమ్మకం. పితృదేవతల ఆశీస్సులకోసం, వారిని శాంతిపజేసేందుకు ప్రతిరోజూ సాయంత్రం ఈ దిశలో ఓ దీపాన్ని వెలిగించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. పితృదేవతలను స్మరిస్తూ వారికోసం ధ్యానం చేస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని నమ్మకం.

హిందూ సనాతన సంప్రదాయంలో కొన్ని దోషాలుంటాయి. అందులో పితృదోషం ఒకటి. మన కన్నతల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ ఎవరికైనా తెలిసో, తెలియకో కష్టాలు కలిగిస్తుంటాయి. అంతేకాదు.. మన పూర్వీకులు ఎవరో తెలిసో తెలియకో చేసిన పాపాలు.. వారి వారసులను పట్టి పీడుస్తుంటాయి. వాటినే పితృదోషాలుగా పిలుస్తాము.

పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు ఏర్పడుతుంటాయి. ఏ రుణమైనా తీరవచ్చు కానీ, మాత, పితరుల రుణం తీర్చుకోలేనిది. ఇక పితృ రుణం నుంచి ముక్తి పొందడం అంత ఈజీ కాదు.

 

పితృదోషం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..

గ్రంథాల ప్రకారం.. ఒక వ్యక్తి పితృదోషంతో బాధపడుతుంటే అతని వంశం ఎంత ప్రయత్నించినా ముందుకు సాగదు. అలాంటి వ్యక్తి సంతానం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. వారికి పుత్ర సంతానం కలగడం అనేది అసాధ్యంగా మారుతుంది. అదేవిధంగా.. ఇంటి ప్రాంగణంలో రావి మొక్కను పెంచడం సరికాదు. అదికూడా విరిగిన కుండలలో రావి మొక్క పెరగడం చెడు సంకేతంగా పరిణిస్తుంటారు. పితృ దోషం ఉంటే జీవితంలో పురోగతి ఉండదు. పిల్లలు నిరంతరం అనారోగ్యానికి గురికావడం కూడా పితృదోషం మరొక చిహ్నంగా భావిస్తారు. ఎటువంటి కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య తరచుగా వివాదాలు రావడం కూడా ఈ దోషం ఉన్నది అనేందుకు సంకేతంగా భావించాలి. మన జీవితంలో ఒకదానితరువాత ఒకటి ఇలా వరుసగా ప్రమాదాలు సంభవిస్తే అది పితృదోషానికి సంకేతంగా పరిగణించాలి.

పూర్వీకుల ఆశీర్వాదం కోసం ఇలా చేయండి..!

♦ పితృదేవతల ఆశీస్సులకోసం.. వారిని శాంతింపజేసేందుకు ప్రతిరోజూ సాయంత్రం ఇంటి నైరుతి మూలలో ఓ దీపాన్ని వెలిగించడం ఉత్తమ ఫలితాలుంటాయి.
♦ పితృపక్షాల సమయంలో శ్రాద్ధం, తర్పణ ఆచారాలను నిర్వహించే సమయంలో తప్పనిసరిగా అది దక్షిణాభిముఖంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
♦ పితృపక్షాల 15రోజులు కాలంలో పొరపాటున కూడా కాళ్లను దక్షిణం వైపు ఉంచి పడుకోకూడదు.
♦ పితృపక్షాల సమయంలో ఆవులు, కాకులు, కుక్కలకు ఆహారం పెట్టాలి. ఆయా జంతువులు, పక్షులకు ఆహారం పెట్టడం పితృకార్యాల్లో ఒకటని పండితులు చెబుతున్నారు.
♦ పితృపక్షాల కాలంలో ఇంట్లో వండిన ఆహారంలో కొంత తప్పకుండా కాకులు, కుక్కలకు పెట్టాలి.
♦ పూర్వీకుల ఆత్మ శాంతికోసం వారి జ్ఞాపకార్థం ఏదైనా సేవా కార్యక్రమాలు చేయొచ్చు.
♦ పెద్దలను గుర్తు చేసుకుంటూ వారి శ్రేయస్సు కోసం పేదలు, బ్రాహ్మణులకు, అవసరంలో ఉన్నవారికి వీలైనంత దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
♦ నదీ పరివాహక ప్రాంతంలో పితరుల ఆత్మ శాంతి కోసం తర్పణాలను వదలాలి.
♦ ఈ పక్షం రోజుల్లో పితృదేవతలను తృప్తి పరిచేందుకు పలు పద్దతులను శాస్త్రాలు సూచిస్తున్నాయి. వాటిలో మీకు అనువైన వాటిని పాటిస్తే పూర్వీకుల ఆశీర్వాదం తప్పక లభిస్తుందని పండితులు చెబుతున్నారు.