Pathaan: పఠాన్ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ కన్ఫం చేసిన కింగ్ ఖాన్!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’ ఇప్పటికే బిటౌన్ వర్గాల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తుండగా, భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో షారుఖ్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Date Locked For Pathaan Trailer Release

Pathaan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’ ఇప్పటికే బిటౌన్ వర్గాల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తుండగా, భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో షారుఖ్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Pathaan: షారుఖ్ ‘పఠాన్’ సినిమాకు సెన్సార్ బోర్డు ఝలక్..!

కాగా ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. దీంతో ఈ చిత్ర ట్రైలర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్‌ను ఫిక్స్ చేసింది. జనవరి 10న పఠాన్ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Pathaan Row: ఆవు హిందువులది, ఎద్దు ముస్లింలదా?.. బేషరం రంగ్ కాంట్రవర్సీపై ఫారూఖ్ అబ్దుల్లా ఫైర్

ఈ సినిమాలో అందాల భామ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోండగా, జాన్ అబ్రహం మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి పఠాన్ ట్రైలర్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.