తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీపిక, రణ్‌వీర్

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణే లాస్ట్ ఇయర్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. 14న కొంకణి వివాహ పద్దతిలో, 15న సింధీ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం జరిగి సంవత్సరం అయింది.
వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇవాళ ఈ దంపతులు తిరుమళ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు ట్రెడిషనల్ లుక్ లో రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో స్వామివారి దర్శనానికి వెళ్లారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు దీపికా రణ్‌వీర్ జంట పద్మావతి ఆలయాలని కూడా సందర్శించనున్నారు.
ప్రస్తుతం వీరిద్దరు కపిల్ దేవ్ బయోపిక్ 83లో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.