×
Ad

Deepika Padukone: సరదా మాటలు సీరియస్ అయ్యాయి.. ఇద్దరు అన్ ఫాలో చేసుకున్నారు.. దీపికా ఎందుకిలా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే వర్కింగ్ (Deepika Padukone)అవర్స్ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు మరో వివాదంతో వైరల్ అవుతోంది.

Deepika Padukone, Farah Khan unfollowed on social media

Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే వర్కింగ్ అవర్స్ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు మరో వివాదంతో వైరల్ అవుతోంది. దానికి కారణం ఒక దర్శకురాలు దీపికాపై చేసిన సరదా కామెంట్స్. ఆ మాటలను సీరియస్ గా తీసుకున్న దీపికా ఆమెను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసింది. ఆ దర్శకురాలు కూడా తిరిగి దీపికాను అన్ ఫాలో చేసింది. దీంతో (Deepika Padukone)ఈ న్యూస్ కాస్తా బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయంగా మారింది. ఇంతకీ, ఈ వివాదానికి కారణం ఏంటంటే? సినిమా వర్కింగ్ అవర్స్ విషయంలో దీపికపై ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తాను అంటూ కండీషన్ పెట్టడం వల్ల తెలుగులో ఆమె చేస్తున్న కల్కి 2, స్పిరిట్ సినిమాల నుంచి తొలగించారు మేకర్స్.

OG Special Show: ఓజీ సినిమా చూసిన మెగా ఫ్యామిలీ.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్

ఈ అంశాన్ని సరదాగా ప్రస్తావించింది బాలీవుడ్ స్టార్ దర్శకురాలు ఫరాఖాన్. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న ఫరా దీపికా గురించి మాట్లాడుతూ.. “ఇప్పుడు ఆమె వర్కింగ్ అవర్స్ ఎనిమిది గంటలు మాత్రమే. కాబట్టి, ఆమె ఈ షోకి ఎలా రాగలరు. ఆమెకు అంత టైం ఎక్కడుంది” అని కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ బాలీవుడ్ లో చర్చకు దారి తీశాయి. విషయం సీరియస్ గా మారడంతో సోషల్ మీడియాలో ఫరాను అన్ ఫాలో చేసింది దీపికా పదుకొణె. అనంతరం ఫరాఖాన్ కూడా దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఇద్దరినీ అన్ ఫాలో చేసేసింది.

నిజానికి, కొంతకాలం క్రితం వరకు దీపికా పదుకొణె, దర్శకురాలు ఫరాఖాన్ మధ్య మంచి సంబంధాలే ఉండేవి. ఈ ఇద్దరు కలిసి ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ వంటి సినిమాలు చేశారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. కానీ, ఒక షోలో సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వారి స్నేహాన్ని బ్రేక్ చేశాయి. మరి ఈ వివాదం ఎప్పటివరకు కొనసాగుతుంది? ఇద్దరు కలిసి మళ్ళీ వర్క్ చేస్తారా లేదా అనేది చూడాలి.