×
Ad

Deepika Padukone : అఫీషియ‌ల్.. కల్కి నుంచి దీపిక పదుకొనే ఔట్.. వెల్ల‌డించిన నిర్మాణ సంస్థ‌..

క‌ల్కి పార్టు 2లో దీపిక పదుకొనే న‌టించ‌డం లేదు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వెల్ల‌డించింది.

Deepika Padukone opt out from Kalki 2898 AD second part

Deepika Padukone : ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్ (Nag Ashwin) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ చిత్రంలో దీపికా పదుకొనే క‌థానాయిక‌. ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెర‌కెక్కించే ప‌నుల్లో చిత్రం బృందం బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

అయితే.. క‌ల్కి పార్టు 2 మూవీలో దీపిక న‌టించ‌డం లేదు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతి మూవీస్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ‘ క‌ల్కి 2లో దీపిక భాగం కావ‌డం లేదు. తొలి భాగం కోసం సుదీర్ఘంగా ఆమెతో ప‌ని చేసిన‌ప్ప‌టికి కూడా మేము భాగ‌స్వామ్యం క‌నుగొన‌లేక‌పోయాం. అన్ని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించిన త‌రువాత మేము విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఆమె భ‌విష్య‌త్తు బాగుండాల‌ని కోరుకుంటున్నాం. గొప్ప టీమ్‌తో క‌ల్కి సీక్వెల్ మీ ముందుకు వ‌స్తుంది.’ అని ట్వీట్ చేసింది.

Sudigali Sudheer : సుధీర్ అందుకే జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు.. అసలు కాల్స్ లిఫ్ట్ చేయడు.. సుధీర్ ని కాంటాక్ట్ చేయాలంటే..

ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం కూడా దీపిక ప‌దుకోన్‌.. ప్ర‌భాస్‌, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ నుంచి కూడా త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఆమె స్థానంలో తృప్తి దిమ్రీని క‌థానాయిక చిత్ర బృందం తీసుకుంది. ఓ బిడ్డ‌కు త‌ల్లి అయిన త‌రువాత దీపిక‌.. రోజుకు ఎనిమిది గంట‌లు మాత్ర‌మే ప‌ని చేస్తాన‌ని అన‌డం, ఎక్కువ పారితోషికం అడగ‌డంతో సందీప్.. దీపిక‌ను త‌ప్పించాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు క‌ల్కి నుంచి దీపిక వైదొల‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తొలి భాగంగ‌లో సుమ‌తి పాత్ర‌లో దీపికా అద్భుతంగా న‌టించింది. ఇప్పుడు ఆమె స్థానంలో సీక్వెల్‌లో ఎవ‌రు న‌టిస్తారు అన్న‌ది ప్ర‌స్తుతం హాట్ టాఫిక్‌గా మారింది.