Sudigali Sudheer : సుధీర్ అందుకే జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు.. అసలు కాల్స్ లిఫ్ట్ చేయడు.. సుధీర్ ని కాంటాక్ట్ చేయాలంటే..

జబర్దస్త్ నటుడు మహీధర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. (Sudigali Sudheer)

Sudigali Sudheer : సుధీర్ అందుకే జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు.. అసలు కాల్స్ లిఫ్ట్ చేయడు.. సుధీర్ ని కాంటాక్ట్ చేయాలంటే..

Sudigali Sudheer

Updated On : September 18, 2025 / 9:21 AM IST

Sudigali Sudheer : జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. మెజీషియన్ గా చేసే సుధీర్ జబర్డస్త్ లో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తర్వాత యాంకర్ గా, కమెడియన్ గా, హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే సుధీర్ గత కొన్నాళ్ల క్రితం నుంచి జబర్దస్త్ లో మానేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జబర్దస్త్ రీ యూనియన్ జరిగితే కూడా అందరూ వచ్చినా సుధీర్ రాలేదు.(Sudigali Sudheer)

తాజాగా జబర్దస్త్ నటుడు మహీధర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుధీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Also Read : Sundarakanda : తల్లి కూతుళ్ళని లవ్ చేసిన హీరో.. ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఏ ఓటీటీలో..

మహీధర్ మాట్లాడుతూ.. అదిరింది షోకి కొంతమంది జబర్దస్త్ ని వదిలేసి వెళ్లిపోయారు. ఆది, సుధీర్ కూడా వెళ్ళాలి. కానీ సుధీర్ కి ఇక్కడే వేరే షోలు ఉన్నాయి. ఆదికి అగ్రిమెంట్స్ ఉన్నాయి అందుకే వెళ్ళలేదు. అయితే సుధీర్ వేరే ఛానల్ లో సింగింగ్ షోకి యాంకర్ గా ఛాన్స్ వస్తే కామెడీ షో కాదు అని ఒప్పుకున్నాడు. కానీ జబర్దస్త్ మేనేజ్మెంట్ అది కామెడీ షో కాకపోయినా అది కూడా చేయొద్దు అన్నారు. దాంతో సుధీర్ అక్కడ ఒప్పుకోవడంతో జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు అని తెలిపాడు.

అలాగే సుధీర్ గురించి చెప్తూ.. అతను చాలా రిజర్వ్‌డ్. ఎవ్వరి ఫోన్స్ లిఫ్ట్ చేయడు. సెట్ లో కూడా షూట్ లేకపోతే కారవాన్ లో ఉంటాడు. ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడాడు. ఆయన ఎవరితో కాంటాక్ట్ లో ఉండరు. బయటకు ఫంక్షన్స్ కు కూడా రాడు. ఎక్కువగా ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కి మాత్రమే కాంటాక్ట్ లో ఉంటాడు. మొదట్నుంచి అంతే సింగిల్ గా ఉంటాడు. సుధీర్ తో ఏదైనా అర్జెంట్ గా మాట్లాడాలి అంటే గెటప్ శ్రీను అన్న ద్వారా కాంటాక్ట్ అవ్వాల్సిందే అని తెలిపాడు.

Also See : Little Hearts : సూపర్ హిట్ సినిమా.. ‘లిటిల్ హార్ట్స్’ వర్కింగ్ స్టిల్స్.. ఫొటోలు..