Deepika Padukone : కల్కి నుంచి దీపికాను అందుకే తీసేసారా? ప్రభాస్ కూడా అడగలేదు కానీ దీపికా అడిగిందట.. ఫ్యాన్స్ కూడా హ్యాపీ..

తాజాగా దీపికాను కల్కి 2 నుంచి కూడా తీసేయడంతో అసలేం జరిగిందని పెద్ద చర్చే నడుస్తుంది. (Deepika Padukone)

Deepika Padukone

Deepika Padukone : ప్రభాస్ కల్కి సినిమాలో దీపికా పదుకోన్ సుమతి అనే ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కల్కి సినిమాకు సీక్వెల్ కూడా ఉండగా ఈ సినిమాలో దీపికా పదుకోన్ నటించట్లేదని నేడు మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలీవుడ్ లో, టాలీవుడ్ లో ఈ వార్త చర్చగా మారింది.(Deepika Padukone)

ఇటీవల కొన్ని రోజుల క్రితం స్పిరిట్ సినిమాలో దీపికాను తీసుకుందాం అనుకుంటే రెమ్యునరేషన్ భారీగా అడిగి, ప్రాఫిట్ లో షేర్ అడిగి, ఇన్ని గంటలే పనిచేస్తాను, సెట్లో ఇవన్నీ కావాలి అని బోలెడు కండిషన్స్ పెట్టడం, కథ లీక్ చేయడంతో సందీప్ దీపికాని తప్పించి తృప్తి డిమ్రిని తీసుకున్నాడు. తాజాగా దీపికాను కల్కి 2 నుంచి కూడా తీసేయడంతో అసలేం జరిగిందని పెద్ద చర్చే నడుస్తుంది.

Also Read : Deepika Padukone : అఫీషియ‌ల్.. కల్కి నుంచి దీపిక పదుకొనే ఔట్.. వెల్ల‌డించిన నిర్మాణ సంస్థ‌..

బాలీవుడ్ సమాచారం ప్రకారం.. దీపికా పదుకోన్ కల్కి మొదటి పార్ట్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ కంటే పార్ట్ 2 కి ఇంకా 25 శాతం ఎక్కువ అడిగిందట. అంతే కాకుండా 7 గంటలు మాత్రమే పనిచేస్తాను రోజుకి అనే కండిషన్ పెట్టింది. అలాగే తనతో 25 మంది స్టాఫ్ వస్తారని, వాళ్లకు కూడా హోటల్ రూమ్స్, ఫుడ్, ఫ్లైట్ టికెట్స్.. ఇలా ఖర్చంతా నిర్మాతలే పెట్టుకోవాలని చెప్పడంతో నిర్మాతకు తడిసి మోపెడవుతుందని భావించి దీపికను వద్దనుకున్నారట. ఆమె ఇచ్చిన పని గంటలోనే పనిచేయాలంటే ఇంత పెద్ద సినిమాకు కష్టం, అలాగే ఆమె కోరిన గొంతెమ్మ కోరికలు అన్నినిర్మాతే తీర్చాలంటే భారీ బడ్జెట్ సినిమాకి ఇంకా బడ్జెట్ పెరుగుతుందని నిర్మాతలు భావించారట. అందుకే దీపికాని వద్దనుకున్నారట.

ప్రభాస్ మొదటి పార్ట్ కి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో సెకండ్ పార్ట్ కి కూడా అంతే తీసుకుంటున్నాడట. సినిమా మార్కెట్ అయ్యేదే ప్రభాస్ వల్ల. అలాంటిది ప్రభాస్ రెమ్యునరేషన్ పెంచమని అడగలేదు దీపికా అడిగిందని టాలీవుడ్ టాక్. ఈ విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్, టాలీవుడ్ జనాలు హ్యాపీగానే ఉన్నారు. దీపికా సినిమా చేస్తే ఆమె పీఆర్ టీమ్ ఎంతగా ప్రమోషన్ చేస్తుందో, సినిమా చేయకపోయినా దీపికాని ఆమె పీఆర్ టీమ్ ఎంత ఎలివేట్ చేస్తుందో తెలిసిందే. కల్కి సమయంలో కూడా ఆమె సింగిల్ పోస్టర్స్ చేయించి బాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేసారు. కల్కి తన సినిమానే అన్నట్టు బాలీవుడ్ లో ప్రభాస్ ని కూడా పక్కన పెట్టి ఓ రేంజ్ లో ప్రమోషన్ చేయించారని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలింగ్. ఇక టాలీవుడ్ నెటిజన్లు కూడా దీపికా కల్కి 2 నుంచి వెళ్ళిపోయినా పర్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Sundarakanda : తల్లి కూతుళ్ళని లవ్ చేసిన హీరో.. ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఏ ఓటీటీలో..