Deepika Padukone : దీపిక ధగధగలు.. వీడియో వైరల్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె లేటెస్ట్ ఫొటోషూట్‌లో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తూ మతాబులా మెరిసిపోయింది..

Deepika Padukone : దీపిక ధగధగలు.. వీడియో వైరల్..

Deepika Padukone

Updated On : July 22, 2021 / 4:05 PM IST

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె లేటెస్ట్ ఫొటోషూట్‌లో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తూ మతాబులా మెరిసిపోయింది. లేటెస్ట్ ఫోటో షూట్‌కి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాలో షేర్ చేసింది దీపిక.

Deepika Padukone

రీసెంట్‌గా ఓ లగ్జరీ వాచ్ అండ్ జ్యుయలరీ బ్రాండ్‌కి దీపిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. ఇక ఫొటోషూట్‌లో డీప్ కట్ నెక్‌తో ఉన్న బ్లూ టాప్, ఫ్లోరల్ స్టైల్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ నెక్లెస్, వాచ్ ధరించి అదరగొట్టేసింది. అలాగే ఈ ప్రమోషనల్ వీడియోలో హ్యాపినెస్‌కి సంబంధించిన టిప్స్ కూడా చెప్పింది.

సినిమాల విషయానికొస్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందబోయే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది దీపిక.. హిందీలో భర్త రణ్‌వీర్‌తో నటించిన ‘83‘ రిలీజ్‌కి రెడీగా ఉంది. షారుఖ్ ఖాన్ పక్కన ‘పఠాన్’, అలాగే రణ్‌వీర్‌ ఫస్ట్ టైం డ్యుయెల్ రోల్ చేస్తున్న ‘సర్కస్’ మూవీలో అతిథిపాత్రలో కనిపించనుంది దీపిక.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)