పాపం దీపికా: Chhapaak బాయ్‌కాట్ చేస్తున్న నెటిజన్లు

పాపం దీపికా: Chhapaak బాయ్‌కాట్ చేస్తున్న నెటిజన్లు

Updated On : January 8, 2020 / 8:58 PM IST

JNU ఆందోళనలపై స్పందించి తొలి అడుగేసిన దీపికా పదుకొణెకు ఎదురుదెబ్బ తగిలింది. ట్విట్టర్ వేదికగా ఆమెపై విరుచుకుపడుతున్నారు. సొంత నిర్మాణంలో యాసిడ్ బాధితురాలి కథాంశంతో తెరకెక్కిన చెపాక్.. ఈ శుక్రవారం విడుదల కానుంది. ఆమెపై వ్యతిరేకతను సినిమా రూపంలో వెల్లగక్కుతున్నారు జేఎన్‌యూ ఆందోళనకారుల సానుభూతిపరులు. 

దీపికా జేఎన్‌యూ నిరసనకారులను కలిసింది… ఆమెను సినిమాల నుంచి బాయ్ కాట్ చేయండంటూ దీపికా గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నప్పటి నుంచి ట్రోల్స్ మొదలుపెట్టారు. ఆ పిలుపుకు చెపాక్ టిక్కెట్ బుక్ చేసుకున్న వారు కూడా తమ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నామని స్క్రీన్ షాట్లతో సహా ట్విట్టర్లో పోస్టు చేస్తున్నారు. 

ఆ ఫొటోల్లో ఉన్నదాని ప్రకారం.. జనవరి 10 శుక్రవారం ఉదయం సినీమార్క్, అకోటా, వడోదరా సాయంత్రం 6గంటల 50నిమిషాల షోకు టిక్కెట్లు బుక్ చేశారు. వారి సీట్ నెంబర్లు ఏ10, ఏ8, ఏ9గా ఉన్నాయి. వారి రీ ఫండ్ అమౌంట్ రూ.420ను కూడా స్క్రీన్ షాట్లు తీసి పెట్టారు.