Deputy Chief Minister Pawan Kalyan was impressed by the science experiment of class 10 students
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వైపు రాజకీయాలు, ఒకవైపు సినిమాలతో క్షణం కూడా ఆయనకి తీరిక దొరకడం లేదు. ఇందులో భాగంగానే ఆయన నిన్న కడప జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులతో సమయం కేటాయించారు. అనంతరం అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.
Also Read : Vidudala 2 : విడుదల పార్ట్ 2 ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ సేతుపతి అదరగొట్టేసాడుగా..
అయితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాల్లో భాగంగా ఈ స్కూల్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చారు. పిల్లలు ఎలా చదువుకుంటున్నారు. స్కూల్ లో వసతులు, భోజనం ఎలా ఉంటున్నాయని అన్ని దగ్గరుండి మరీ పరిశీలించారు. ఇందులో భాగంగానే చాలా మంది పిల్లలు తమలో ఉన్న టాలెంట్ ము బయటపెట్టారు. తమ టాలెంట్ ను ప్రదర్శిస్తూ.. పవన్ కళ్యాణ్ కి చూపించారు.
ఉప ముఖ్యమంత్రి @PawanKalyanని ఆకట్టుకున్న పదవ తరగతి విద్యార్థుల సైన్స్ ఎక్సపరిమెంట్.
– వృద్ధులు, పక్షవాతం, అంగవైకల్యంతో బాధ పడే వారి సౌకర్యార్థం రూపకల్పన.
– రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ దాటడానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆలోచన.ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచన కలిగినందుకు… pic.twitter.com/Ji9gBKC7Ro
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 7, 2024
అయితే ఇందులో 10వ తరగతి విద్యార్థులు చేసిన ఒక సరికొత్త సైన్స్ ఎక్సపరిమెంట్ చూసి ఎంతో ఆనందించారు పవన్. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వృద్ధులు, పక్షవాతం, అంగవైకల్యంతో బాధపడే వారు రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ దాటడానికి ఇబ్బంది పడుతుంటారు. వారికి ఇబ్బంది కలగకుండా ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ దాటడానికి సులువైన పద్ధతిని కనుక్కుంటూ 10వ తరగతి విద్యార్థులు చక్కటి ఆలోచన చేశారు. అది ఎలా, ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ కి చూపించారు. వారి ఎక్సపరిమెంట్ చూసిన పవన్ ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచన కలిగినందుకు ప్రత్యేకంగా అభినందించారు. వారితో సెల్ఫీలు కూడా దిగారు. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.