Vidudala 2 : విడుదల పార్ట్ 2 ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ సేతుపతి అదరగొట్టేసాడుగా..

విడుదల పార్ట్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Vidudala 2 : విడుదల పార్ట్ 2 ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ సేతుపతి అదరగొట్టేసాడుగా..

Vijay Sethupathi Vidudala 2 movie Official Trailer released

Updated On : December 8, 2024 / 11:40 AM IST

Vidudala 2 : తమిళ ‘విడుదల’ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, సూరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విడుదలైంది.  తెలుగులో కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇక పార్ట్ వన్ భారీ విజయాన్ని అందుకోవడంతో దీనికి పార్ట్ 2 ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే పార్ట్ 2 కి సంబందించిన వరుస అప్డేట్స్ ఇస్తున్నారు .

Also Read : Top 10 Movies : ఫస్ట్ డే భారీ వసూళ్లు రాబట్టిన టాప్ 10 ఇండియన్ సినిమాలు.. అందులో సగం ప్రభాస్ వే..

ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో విజయ్ సేతుపతి చెప్పే.. కులం మతం అనే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. ట్రైలర్ చూస్తుంటే కులమతాల మధ్య ఉండే బేధం, వాటికి రాజకీయాలు కూడా తోడైతే ఎలా ఉంటుందో అన్నది చూపిస్తారని తెలుస్తుంది. వెనుకబడ్డ కులాలకు, పెద్ద కులాలకు మధ్య జరిగే వాదన ఎలా ఉంటుంది అన్న పాయింట్ తో ట్రైలర్ అద్భుతంగా చూపించారు. విజయ్ తన నటనతో చాలా బాగా ఆకట్టుకున్నారు. ట్రైలర్ మీరు కూడా చూసెయ్యండి.


కాగా ఈ సినిమా డిసెంబర్ 20న కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ కానుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందించారు.