Devara 50 Days Celebrations At Sudarshan Theater
Devara : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూవీ దేవర. జాన్వీకపూర్ కథానాయికగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక 52 సెంటర్లలో ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది.
ఈ చిత్రం విడుదలై యాభై రోజులు పూర్తి కావడంతో అర్థశతదినోత్సవ వేడుకలను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని సుదర్శన థియేటర్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. నిర్మాతలు శిరీష్, నాగ వంశీ, హీరో విశ్వక్ సేన్‌లు ముఖ్య అతిథులుగా ఈ వేడకకు హాజరు కానున్నారు.
Allu Ayaan – Arha : బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ పిల్లలు.. తగ్గేదేలే అంటున్న అయాన్..
ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్ర రెండో భాగం ఉండనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే రెండో భాగం షూటింగ్ ప్రారంభం కానుంది.
Those were the days when days and centers used to be the measure of success.
After a long time seeing what #Devara has achieved with audience love after 50 days is truly heartwarming ❤️
This is the MEASURE OF UNSHAKABLE LOVE FROM THE AUDIENCE 🙏🏻
50 Days – 52 Centers.
Fear is… pic.twitter.com/ZVpQ4qq8CF— Devara (@DevaraMovie) November 14, 2024