Allu Ayaan – Arha : బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ పిల్లలు.. తగ్గేదేలే అంటున్న అయాన్..
బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ వచ్చి సందడి చేసారు.

Allu Arjun Childrens Allu Ayaan and Arha came to Balakrishna Unstoppable Show
Allu Ayaan – Arha : అల్లు అర్జున్ బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి రాగా ఆ ఎపిసోడ్ నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. షో ఆద్యంతం బన్నీ, బాలయ్య కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. షో మధ్యలో బన్నీ ఫ్రెండ్, బన్నీ తల్లి నిర్మల వచ్చారు. అయితే ఇది పార్ట్ 1 మాత్రమే. ఈ ఇంటర్వ్యూ పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2కి సంబంధించిన చిన్ని వీడియోని ఈ ఎపిసోడ్ చివర్లో ప్లే చేసారు.
అయితే బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ వచ్చి సందడి చేసారు. పార్ట్ 2లో వీళ్లకు సంబంధించిన కంటెంట్ ఉండబోయితుంది. అల్లు అర్హ, అయాన్ ఇద్దరూ వచ్చి బాలయ్య కాళ్లకు నమస్కరించారు. ఇద్దరు బన్నీకి అటు ఇటు కూర్చున్నారు. అయాన్ తగ్గేదేలే అంటూ పుష్ప డైలాగ్ చెప్పాడు. ఇద్దరు కలిసి కాసేపు క్యూట్ గా అల్లరి చేసినట్టు తెలుస్తుంది.
అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ క్యూట్ అల్లరి చూడాలంటే పార్ట్ 2 వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. అయాన్, అర్హ రావడంతో ఈ ఇంటర్వ్యూ పార్ట్ 2 పై మరింత ఆసక్తి నెలకొంది. ఇంకా పార్ట్ 2 లో ఎవరెవరు వస్తారో చూడాలి.