Allu Arjun Mother : స్నేహతో లవ్ గురించి.. బన్నీ వాళ్ళ అమ్మకు చెప్తే ఏమందో తెలుసా..? బాలయ్య షోలో అల్లు అర్జున్ తల్లి..

ల్లు అర్జున్ పెళ్లి గురించి అడిగారు బాలయ్య. మొదట మీకు చెప్పాడా? చెప్తే మీరు ఏమన్నారు అని అడిగాడు బాలయ్య.

Allu Arjun Mother : స్నేహతో లవ్ గురించి.. బన్నీ వాళ్ళ అమ్మకు చెప్తే ఏమందో తెలుసా..? బాలయ్య షోలో అల్లు అర్జున్ తల్లి..

Allu Arjun Mother Nirmala Comments on his Love in Balayya Unstoppable Show

Updated On : November 15, 2024 / 3:30 PM IST

Allu Arjun Mother : తాజాగా అల్లు అర్జున్ బాలయ్య అన్‌స్టాప‌బుల్ షోకి రాగా ఈ షోలో బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు. బాలయ్య కూడా రకరకాల ప్రశ్నలు అడిగి ఫుల్ గా నవ్వించారు. షో ఆద్యంతం ఫన్నీగా సాగింది. అయితే ఈ షోలో మరో గెస్ట్ గా అల్లు అర్జున్ తల్లి నిర్మల కూడా వచ్చారు.

నిర్మల.. అల్లు అర్జున్ చిన్నప్పటి విషయాలు పంచుకుంది. అల్లు అరవింద్ గురించి, అల్లు రామలింగయ్య గురించి మాట్లాడారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పెళ్లి గురించి అడిగారు బాలయ్య. మొదట మీకు చెప్పాడా? చెప్తే మీరు ఏమన్నారు అని అడిగాడు బాలయ్య.

Also Read : Allu Arjun Best Friend : వీడు లేకపోతే నేను ఉండలేను.. బాలయ్య షోకు బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. గోవాలో బన్నీ ఆల్కహాల్ కొన్నది ఇతని కోసమే..

దీనికి అల్లు అర్జున్ తల్లి.. ఒక రోజు నా దగ్గరకు వచ్చి అమ్మ నేనొకటి చెప్పాలి. నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పటికే హీరోగా ఉన్నాడు. నీకు నిజంగా 100 శాతం ఆ అమ్మాయి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో అన్నాను అని తెలిపారు. ఇక అల్లు అర్జున్.. స్నేహ రెడ్డి కొన్నాళ్ళు ప్రేమించి పెద్దలను ఒప్పించి 2011 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అయాన్, ఆద్య ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెల్సిందే.