Allu Arjun Best Friend : వీడు లేకపోతే నేను ఉండలేను.. బాలయ్య షోకు బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. గోవాలో బన్నీ ఆల్కహాల్ కొన్నది ఇతని కోసమే..

గతంలో అల్లు అర్జున్ గోవాలో ఓ వైన్ షాప్ కు వెళ్లిన వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోని షోలో ప్లే చేసి దాని గురించి అడిగాడు బాలయ్య.

Allu Arjun Best Friend : వీడు లేకపోతే నేను ఉండలేను.. బాలయ్య షోకు బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. గోవాలో బన్నీ ఆల్కహాల్ కొన్నది ఇతని కోసమే..

Do You Know Allu Arjun Best Friend he Appears in Balakrishna Unstoppable Show

Updated On : November 15, 2024 / 3:06 PM IST

Allu Arjun Best Friend : తాజాగా అల్లు అర్జున్ బాలయ్య అన్‌స్టాప‌బుల్ షోకి రాగా ఈ షోలో బోలెడన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బాలయ్య కూడా అనేక ప్రశ్నలు అడిగి సమాధానాలు రప్పించాడు. షో ఆద్యంతం ఫన్నీగా సాగింది. గతంలో అల్లు అర్జున్ గోవాలో ఓ వైన్ షాప్ కు వెళ్లిన వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోని షోలో ప్లే చేసి దాని గురించి అడిగాడు బాలయ్య.

దీనికి అల్లు అర్జున్ సమాధానమిస్తూ.. అది నా పేరు సూర్య సినిమా సమయంలో జరిగింది. నా ఫ్రెండ్ సందీప్ రామినేని అని మీ హార్డ్ కొర్ ఫ్యాన్. నేను గోవాలో షూట్ చేస్తున్నాను. వాడు గోవా వచ్చి నాకు ఫోన్ చేస్తే ఏం కావలి అంటే వాడు తాగే బ్రాండ్ అడిగాడు. ఒక షాప్ కి వెళ్లి డ్రైవర్ ని పంపిస్తే అతను కొత్త మాట్లాడటం రాకపోవడంతో నేనే వెళ్లి ఆ బ్రాండ్ అడిగాను. లేదంటే వెళ్ళిపోయాను. నేను సెలబ్రిటీ అని మర్చిపోయి దిగి వెళ్ళాను. అప్పుడు వాడ్ని తిట్టుకున్నాను. అలాంటి ఫ్రెండ్ ఉంటే ఇలాంటివే జరుగుతాయి అంటూ తెలిపాడు.

Also Read : Allu Sirish – Allu Arjun : స్కూల్ మారిస్తే అమ్మాయిలు బాలేరని, ఇంగ్లీష్‌లో మాట్లాడట్లేదని ఏడ్చేవాడు.. బన్నీ సీక్రెట్స్ చెప్పిన శిరీష్..

వాడు మీ ఫ్యాన్, మిమ్మల్ని కలిపిస్తాను అని చెప్పాను అంటూ అతన్ని షోలోకి పిలిచాడు అల్లు అర్జున్. ఇక షోలోకి సందీప్ రామినేని రాగా బాలయ్య కాళ్లకు నమస్కరించాడు. చిన్నప్పుడు ఇద్దరూ కలిసి బోలెడన్ని చిలిపి పనులు చేసినట్టు చెప్పాడు. సందీప్ రామినేని ని బన్నీ కౌగలించుకొని నా బెస్ట్ ఫ్రెండ్.. వీడు లేకపోతే నేను ఉండలేను అని అన్నాడు. మీరు కూడా ఎపిసోడ్ ఆహా ఓటీటీలో చూసేయండి.