Allu Sirish – Allu Arjun : స్కూల్ మారిస్తే అమ్మాయిలు బాలేరని, ఇంగ్లీష్‌లో మాట్లాడట్లేదని ఏడ్చేవాడు.. బన్నీ సీక్రెట్స్ చెప్పిన శిరీష్..
అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.

Allu Sirish Reveals Interesting Thing about Allu Arjun in Balakrishna Unstoppable Show
Allu Sirish – Allu Arjun : అల్లు అర్జున్ తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశాడు. ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షోలో నాలుగో ఎపిసోడ్ కు అల్లు అర్జున్ వచ్చాడు. ఈ షోలో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలపగా అల్లు అర్జున్ కి సన్నిహితుల నుంచి వీడియో బైట్స్ కూడా తీసుకువచ్చి షోలో ప్లే చేసారు.
ఈ క్రమంలో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వీడియో బైట్ ప్లే చేసారు. ఇందులో అల్లు శిరీష్ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు. అల్లు శిరీష్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ లో చదువుకున్నం. కానీ అర్జున్ కి కొంచెం చదవడం కష్టం అయింది అని CBSE స్కూల్ నుంచి స్టేట్ సిలబస్ స్కూల్ కి మార్చారు. అక్కడ ఇంగ్లీష్ ఎవరూ మాట్లాడట్లేదు, అమ్మాయిలు బాగోలేదు అని ఏడ్చేవాడు. ఆ స్కూల్ నచ్చలేదు మా అన్నయ్యకు. స్కూల్ కి రెడీ అయ్యేవాడు కాదు, ఇష్టమొచ్చినట్టు వెళ్ళేవాడు. అక్కడ రూబెన్ అని ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఎగ్జామ్స్ కోసం కంబైన్డ్ స్టడీస్ చేద్దామని ఓ సారి రూబెన్ మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూసి షాక్ అయ్యాడు. నన్ను ఇంటి ఓనర్ కొడుకా అని అడిగితే అవును అన్నాను. అర్జున్ కోసం వచ్చానని చెప్తే వెళ్లి పిలిచాను. అర్జున్ వచ్చి సోఫా లో కూర్చుంటే ఇంటి ఓనర్ కొడుకు చూస్తాడు సోఫాలో కుర్చున్నావేంటి అని అడిగాడు రూబెన్. అప్పుడు అర్జున్ ఇది మా ఇల్లే, వాడు నా తమ్ముడు అని చెప్పాడు అంటూ తెలిపాడు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా? ఆ సినిమాకు అయితే పడీ పడీ నవ్వాడట..
దీని గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నా చదువు అంతంత మాత్రమని తెలిసి గొప్ప స్కూల్ నుంచి తీసేసి మాములు స్కూల్ లో చేర్చారు. ఆ స్కూల్ లో కార్ లో వచ్చే ఏకైక క్యాండెట్ నేనే. అది నాకు ఇబ్బందిగా అనిపించి వీధి చివర్లో కార్ ఆపించి అక్కడ్నుంచి నడిచి వెళ్ళేవాడిని. నన్ను చూస్తే ఏదో పూరి గుడిసెలో ఉండేవాడు అనుకున్నారు. నా ఫ్రెండ్ అలాగే అనుకున్నాడు. నా ఇంటికి పిలిస్తే వచ్చి నా గెటప్, నా ఇల్లు చూసి కంపారిజాన్ లేదనుకున్నాడు అని తెలిపాడు.