Allu Arjun : అల్లు అర్జున్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా? ఆ సినిమాకు అయితే పడీ పడీ నవ్వాడట..

బాలయ్య కూడా అనేక ప్రశ్నలు అడిగారు బన్నీని.

Allu Arjun : అల్లు అర్జున్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా? ఆ సినిమాకు అయితే పడీ పడీ నవ్వాడట..

Do You Know Allu Arjun Favourite Hero in This Generation Reveals in Unstoppable Show

Updated On : November 15, 2024 / 11:29 AM IST

Allu Arjun : అల్లు అర్జున్ తాజాగా బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకి వచ్చి సందడి చేశాడు. ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాప‌బుల్ లో మూడు ఎపిసోడ్స్ పూర్తవ్వగా నాలుగో ఎపిసోడ్ కు అల్లు అర్జున్ వచ్చాడు. ఈ షోలో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అలాగే బాలయ్య కూడా అనేక ప్రశ్నలు అడిగారు బన్నీని. ఈ షో అంతా సరదాగా సాగింది.

ఈ క్రమంలో బాలయ్య.. ఇప్పటి జనరేషన్స్ లో నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా అల్లు అర్జున్ సమాధానమిస్తూ.. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫెమెన్స్ బాగా నచ్చింది. నవీన్ పోలిశెట్టి కూడా ఇష్టం. జాతి రత్నాలు సినిమా అయితే కింద పడీ పడీ నవ్వుకుంటూ చూసాను. సిద్ధూ జొన్నలగడ్డ బాగా నచ్చాడు. ఈ మధ్య విశ్వక్ సేన్ కూడా నచ్చాడు. అడివి శేష్ ని బాగా అడ్మయిర్ చేస్తాను అని చెప్పాడు.

Also Read : Mahesh Babu – Allu Arjun : తెలుగు సినిమాల స్టాండర్డ్ పెంచిన యాక్టర్.. బాలయ్య షోలో మహేష్ పై అల్లు అర్జున్ కామెంట్స్..

అయితే వీళ్లందరిలో ఒకర్ని చెప్పమని బాలయ్య అడగడంతో అల్లు అర్జున్.. నన్ను బాగా ఇంపాక్ట్ చేసింది మాత్రం సిద్ధూ జొన్నలగడ్డనే. డీజే టిల్లుతో ఇంప్రెస్ చేశాడు అని చెప్పాడు. దీంతో ఇప్పటి హీరోల్లో అల్లు అర్జున్ కి వీళ్లంటే బాగా ఇష్టమని తెలుస్తుంది. మరి దీనిపై ఈ యువ హీరోలు ఏమైనా కామెంట్స్ చేస్తారేమో చూడాలి.