Mahesh Babu – Allu Arjun : తెలుగు సినిమాల స్టాండర్డ్ పెంచిన యాక్టర్.. బాలయ్య షోలో మహేష్ పై అల్లు అర్జున్ కామెంట్స్..
మహేష్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ..

Allu Arjun Interesting Comments on Mahesh Babu in Balakrishna Unstoppable Show
Mahesh Babu – Allu Arjun : తాజాగా అల్లు అర్జున్ బాలకృష్ణ ఆహా అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చారు. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ రాగా నాలుగో ఎపిసోడ్ కు బన్నీ వచ్చి సందడి చేసారు. నేటి నుంచి ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోలో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలపగా బాలకృష్ణ కొంతమంది హీరోల ఫొటోలు చూపించి వాళ్ళ గురించి బన్నీని అడిగారు..
Also Read : Puhpa 2 Trailer : పుష్ప ట్రైలర్ నిడివి ఎంతో తెలుసా.. మాస్ మ్యాడ్‌నెస్ అంటూ ట్వీట్..
ఈ క్రమంలో మహేష్ బాబు ఫొటో చూపించారు. మహేష్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అందరూ ఆయన అందం గురించి మాట్లాడతారు. అన్ని నాకు ఆయన కమ్ బ్యాక్స్ బాగుంటాయి. ఫెయిల్యూర్స్ తర్వాత ఆయన నుంచి వచ్చే కమ్ బ్యాక్ సినిమాలు బాగుంటాయి. తెలుగు సినిమాల స్టాండర్డ్ పెంచిన యాక్టర్. ఆయన మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది అని అన్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ బన్నీ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.