Devara Movie 10 Days World Wide Collections Details Here
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవర. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ 10 రోజుల్లో 466 కోట్లు వసూలు చేసింది.
ఈ విషయాన్ని ఓ కొత్త పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది. ప్రస్తుతం హవా చూస్తుంటే దసరా నాటికి ఈ చిత్రం రూ. 500 కోట్ల కబ్‌లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం దసరా సెలవులు ఉండడం ఈ చిత్రానికి ప్లస్ కానుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దేవర తొలి పార్టు విజయవంతం కావడంతో రెండో పార్టు ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశౄరు. పార్ట్ 2 ఇంకా బాగుంటుందన్నారు. ఇప్పటికే పార్ట్2లో రెండు మేజర్ సీన్స్ షూట్ కూడా పూరైందన్నాడు.
దర్శకుడు కొరటాల శివ తొలి భాగం కోసం ఎంతో కష్టపడ్డాడు. అందుకనే ఓ నెలరోజులు ఆయన్ను రెస్ట్ తీసుకోమని, ఎక్కడికైనా హాలీడేకు వెళ్లమని చెప్పినట్లు ఎన్టీఆర్ తెలిపారు.
Karthi – Mahesh : కార్తీ, మహేష్ బాబు స్కూల్‌లో క్లాస్ మెట్సా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కార్తీ..
When the sea gets wild…..
nothing can stop a force like #Devara 🔥#BlockbusterDevara pic.twitter.com/18Q4wxLbXr— Devara (@DevaraMovie) October 7, 2024