Karthi – Mahesh : కార్తీ, మహేష్ బాబు స్కూల్‌లో క్లాస్ మెట్సా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కార్తీ..
మహేష్ చిన్నప్పుడు చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే.

Mahesh Babu and Karthi Studied in one Class Karthi Comments goes Viral
Karthi – Mahesh : మన సెలబ్రిటీలు కొంతమంది చిన్నప్పుడు కలిసి చదువుకున్నారని తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు సెలబ్రిటీలు కలిసి చదువుకున్నారని తెలిసింది. కార్తీ ఇటీవల సత్యం సుందరం సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొనగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తారు మీరు, మహేష్ బాబుతో ఏమైనా ప్లాన్ చేస్తారా అని అడగ్గా కార్తీ మాట్లాడుతూ.. ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. నేను, మహేష్ చిన్నప్పుడు ఒకే క్లాస్ లో కలిసి చదువుకున్నాం అని తెలిపారు.
మహేష్ చిన్నప్పుడు చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ చెన్నైలోని సెయింట్ బెడ్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదువుకున్నాడు. కార్తీ కూడా అదే స్కూల్ లో చదివాడు. అలా ఇద్దరూ కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. వీరిద్దరికి రెండేళ్లు డిఫరెన్స్ ఉంది. అయితే మహేష్ చిన్నప్పుడే సినిమాలు, షూటింగ్స్ బిజీ వల్ల ఒక క్లాస్ తగ్గింది. అలా ఇద్దరు కలిసి ఒకే క్లాస్ లో చదువుకున్నారు.
Also Read : Mahesh Babu : అదిరిందిగా బాబు స్టైలిష్ లుక్.. మళ్ళీ విదేశాలకు చెక్కేసిన మహేష్ బాబు..
ఇక కార్తీ ఇటీవలే సత్యం సుందరం లాంటి మంచి ఎమోషనల్ కంటెంట్ సినిమాతో వచ్చి మెప్పించారు. మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.