×
Ad

NTR : బాబోయ్ ఒక యాడ్ చేయడానికి ఎన్టీఆర్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా..!

ఇటీవల ఎన్టీఆర్ వరుస యాడ్స్ చేసి అదరగొడుతున్నాడు. అయితే ఎన్టీఆర్ ఒక యాడ్ కోసం ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడా తెలుసా?

  • Published On : June 13, 2023 / 02:50 PM IST

Devara star NTR charging huge remuneration for commercial ads

NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ హప్పెనింగ్ స్టార్ అయ్యిపోతున్నాడు. ఒక పక్క పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఒకే చేస్తూనే, మరో పక్క పాన్ ఇండియా యాడ్స్ ని కూడా చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. RRR తో ఎన్టీఆర్ కి ఎంతటి ఫేమ్ వచ్చిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఇక పాపులారిటీని కొన్ని బ్రాండ్స్ వాళ్ళ కమర్షియాలిటీకి ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫుడ్, డ్రింక్ ఇతర బ్రాండ్స్ కి అంబాసడర్ గా ఎన్టీఆర్ సైన్ చేసేస్తున్నాడు.

Rajamouli : రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా.. ఆ యాడ్ లో నటిస్తున్నారా? వైరల్ అవుతున్న వీడియో..

కాగా ఎన్టీఆర్ ఇప్పటి వరకు.. లీషియస్ (Licious foods), యాపీ ఫిజ్ (Appy Fizz), మెక్ డొనాల్డ్స్ (McDonald’s) వంటి యాడ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ యాడ్స్ చేయడానికి తారక్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. రీసెంట్ చేసిన మెక్ డొనాల్డ్స్ యాడ్ కు గాను ఎన్టీఆర్.. ఏకంగా 6 – 8 కోట్లు వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఒక యాడ్ కోసమే ఎన్టీఆర్ ఇంత మొత్తంలో తీసుకుంటుంటాడా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఎన్టీఆర్ చేసిన యాడ్ వల్ల మెక్ డొనాల్డ్స్ సేల్స్ కూడా పెరిగినట్లు సమాచారం.

Vyuham : ఆర్జీవీ వ్యూహం కథ ఇదే.. వ్యూహం తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వరకు పొలిటికల్ సినిమాలు తీయను.. ఆర్జీవీ వ్యాఖ్యలు..

ఇక ఎన్టీఆర్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో దేవర (Devara) సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా తరువాత బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ వార్ 2 (War 2) లో భాగం కాబోతున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.