Rajamouli : రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా.. ఆ యాడ్ లో నటిస్తున్నారా? వైరల్ అవుతున్న వీడియో..

ఇప్పటిదాకా రాజమౌళి ఏ యాడ్ లో కూడా నటించలేదు. కానీ మొదటిసారి రాజమౌళి ఓ యాడ్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా రాజమౌళి యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

Rajamouli : రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా.. ఆ యాడ్ లో నటిస్తున్నారా? వైరల్ అవుతున్న వీడియో..

Rajamouli acting in a Advertisement for a Mobile company Brand

Updated On : June 13, 2023 / 12:31 PM IST

Rajamouli : రాజమౌళి బాహుబలి(Bahubali) సినిమాతో దేశమంతా, RRR సినిమాతో ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తన RRR సినిమాతో హాలీవుడ్(Hollywood) టెక్నీషియన్స్, టాప్ డైరెక్టర్స్ ని సైతం మెప్పించాడు. RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్(Oscar) సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో రాజమౌళి ప్రపంచమంతా పాపులర్ అయ్యారు. అయితే ఈ పాపులారిటీని కొన్ని కంపెనీలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి.

రాజమౌళి దర్శకధీరుడు అని తెలిసిందే. కానీ నటుడిగా పలు సినిమాల్లో గెస్ట్ గా మెరిశాడు. ఇప్పుడు సెలబ్రిటీలంతా కొంచెం ఫేమ్ రాగానే యాడ్స్ చేస్తూ డబ్బులు వెనకేసుకుంటున్నారు. డైరెక్టర్స్ యాడ్స్ లో నటించడం చాలా తక్కువ. ఇప్పటిదాకా రాజమౌళి ఏ యాడ్ లో కూడా నటించలేదు. కానీ మొదటిసారి రాజమౌళి ఓ యాడ్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా రాజమౌళి యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

TFI Producers : జనసేన పార్టీ ఆఫీస్‌లో సినీ నిర్మాతలు.. వైరల్ అవుతున్న ఫొటోలు..

ఈ వీడియోలో రాజమౌళి సూట్ వేసి అదరగొట్టేశాడు. స్టైల్ గా ఫోన్ తిప్పుతూ నడుస్తూ హంగామా చేశారు. ఐతే ఇది ఒప్పో కంపెనీ ఫోన్ కోసం యాడ్ చిత్రీకరిస్తున్నట్టు, ఇందులో రాజమౌళి నటిస్తున్నట్టు, రాజమౌళి ఒప్పోకి బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఇప్పుడు రాజమౌళి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. హీరోలా ఉన్నారు, మీరు కూడా యాక్టింగ్ చేయండి, రాజమౌళి అదరగొట్టారు అంటూ రాజమౌళిని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.