Devara will Postponed rumours goes viral another movies ready to release on devara date
Devara : ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారని ఆల్రెడీ ప్రకటించారు. కానీ గత కొన్ని రోజుల నుంచి దేవర సినిమా వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 5 డేట్ కి వస్తే దగ్గర్లో రంజాన్ కూడా ఉంది 5 రోజులు సినిమాకు కలెక్షన్స్ కలిసి వస్తాయి, పాన్ ఇండియా వైడ్ కూడా రికార్డులు కొట్టొచ్చు అనుకున్నారు అభిమానులు.
ప్రస్తుతం దేవర సినిమా వాయిదా పడిందని టాలీవుడ్ లో కూడా బాగా వినిపిస్తుంది. షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తి కాలేదని, VFX వర్క్స్ కి కూడా టైం ఎక్కువ పడుతుందని, సైఫ్ అలీఖాన్ సర్జరీ చేయించుకొని రావడంతో అతని షూటింగ్ పార్ట్ కి కూడా టైం పడుతుందని.. ఇలా పలు కారణాలతో దేవర వాయిదా పడనుందని సమాచారం. అయితే అదే డేట్ కి తెలుగులో ఇబ్బంది లేకపోయినా పాన్ ఇండియా వైడ్ తమిళ్ భారీ ప్రాజెక్టు సూర్య ‘కంగువ'(Kanguva) సినిమా, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృధ్విరాజ్ సుకుమారన్ ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా, అజయ్ దేవగణ్ ‘మైదాన్’ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. దేవర సినిమా వాయిదాకు ఇది కూడా ఒక కారణం అని సమాచారం.
Also Read : Deepak Saroj : మహేష్ ‘అతడు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోగా అర్జున్ రెడ్డి రేంజ్ సినిమా..
ఒకవేళ దేవర నిజంగానే వాయిదా పడితే ఆ డేట్ కి రావడానికి టాలీవుడ్ లో రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఒకటి డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్(Tillu Square). ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా మంచి డేట్ కోసం చూస్తుంది. దేవర వాయిదా పడితే సిద్ధూ తన సినిమాని ఆ డేట్ కి తీసుకొచ్చేస్తాడు. ఇక మరో సినిమా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్(Family Star). గత సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని సమాచారం. ఈ సినిమాని కూడా దేవర వాయిదా పడితే అదే డేట్ కి తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. మరి చూడాలి ఏప్రిల్ లో టాలీవుడ్ నుంచి ఏ సినిమాలు సమ్మర్ ని గ్రాండ్ గా మొదలుపెడతాయో.